📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

America: యూఎస్ కు ‘విపత్తుల ఫంగస్‌’ అక్రమ రవాణా

Author Icon By Shobha Rani
Updated: June 4, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (America) సంయుక్త రాష్ట్రాల్లోకి అత్యంత ప్రమాదకరమైన జీవ వ్యాధికారక క్రిమిని (బయోలాజికల్ పాథోజెన్) అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై ఇద్దరు చైనా దేశస్థులు చిక్కుల్లో పడ్డారు. ఈ పాథోజెన్‌ను వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా ఉపయోగించే అవకాశాలున్నాయని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ సంఘటన అమెరికా (America) జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. నిందితులు అమెరికా(America) లోకి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యాధికారక క్రిమిని ‘ఫ్యుసేరియం గ్రామినియారం’గా గుర్తించారు. ఇది పంటలపై “కంకి ఎండు తెగులు” (హెడ్ బ్లైట్) అనే వ్యాధిని కలుగజేస్తుందని, దీనివల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. ఈ ఫంగస్ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పంటల నష్టం అనేక బిలియన్ల డాలర్లకు చేరుతుంది. అమెరికా వ్యవసాయ భద్రతపై ఇది భయంకరమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా దీనిని సంభావ్య వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా వర్గీకరించినట్లు తెలిపింది. ఈ ఫంగస్ వల్ల విడుదలయ్యే విషపదార్థాలు మనుషులు, పశువుల్లో వాంతులు, కాలేయానికి నష్టం, పునరుత్పత్తి సంబంధిత లోపాలను కూడా కలిగిస్తాయి.

America: యూఎస్ కు ‘విపత్తుల ఫంగస్‌’ అక్రమ రవాణా

అభియోగాలు – తీవ్రమైన నేరాల జాబితా
ఎఫ్‌బీఐ నమోదు చేసిన క్రిమినల్ ఫిర్యాదు ప్రకారం.. జున్యోంగ్ లియు (34) చైనా పరిశోధకుడు. 2024 జులైలో తన స్నేహితురాలు యున్కింగ్ జియాన్ (33)ను కలవడానికి అమెరికా (America) వచ్చినప్పుడు ఈ ఫంగస్‌ను తనతోపాటు తీసుకువచ్చాడు. జియాన్ పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రయోగశాలలో పరిశోధనలు నిర్వహించేందుకే తాను ఈ పాథోజెన్‌ను అక్రమంగా అమెరికాలోకి తెచ్చినట్టు లియు అంగీకరించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఎలక్ట్రానిక్ సంభాషణలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయని అధికారులు తెలిపారు. వీరిపై కుట్ర, అమెరికాలోకి వస్తువుల అక్రమ రవాణా, తప్పుడు ప్రకటనలు చేయడం, వీసా మోసం వంటి అభియోగాలను నమోదు చేశారు. యున్కింగ్ జియాన్ చైనాలో ఈ పాథోజెన్‌పై పరిశోధన చేయడానికి చైనా ప్రభుత్వం నుంచి నిధులు కూడా పొందినట్లు తెలిసింది. ఆమె ఎలక్ట్రానిక్ పరికరాల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)తో సంబంధాలున్నట్టు సూచించే సమాచారం కూడా లభ్యమైందని సమాచారం. శాస్త్రీయ పరిశోధన పేరుతో అత్యంత సున్నితమైన పాథోజన్ల అక్రమ ప్రయోగాలు ఆందోళనకరం. ఈ కేసు తర్వాత పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు పటిష్ఠ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం.

Read Also: Raja Raghuvanshi: మధ్యప్రదేశ్‌ దంపతుల కేసులో హత్య

'Disaster Fungus' to US #telugu News Breaking News in Telugu Google news Latest News in Telugu Paper Telugu News Smuggling of Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.