📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Odisha: కోరాపుట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఆరుగురు మృతి

Author Icon By Shobha Rani
Updated: June 5, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా (Odisha) రాష్ట్రం కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ఇంజక్షన్ వికటించి చనిపోయారు. మృతులంతా వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారు. రోగులు గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరికి సర్జరీలు కూడా జరిగాయి. సర్జరీ కూడా విజయవంతం అయ్యింది. ఈ క్రమంలోనే ఆరుగురు రోగులకు ఒకే బ్యాచ్‌కి చెందిన ఇంజక్షన్లు ఇవ్వగా, వాటిని వేసిన కొద్ది నిమిషాల్లోనే రోగులు ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు. వెంటనే పరిస్థితి గమనించి ఐసీయూకు తరలించినా ప్రాణాలు నిలుపలేకపోయారు. విషయ తీవ్రతను గమనించిన ఆసుపత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు మరణించిన ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సంబంధిత ఇంజక్షన్ బ్యాచ్‌ను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతానికి ఉన్నతాధికారులు ఆసుపత్రి డాక్టర్లు, నర్సుల్ని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, మృతుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవారు మృతిచెందారని బంధువులు ఆందోళనకు దిగారు. ఇంజక్షన్ బ్యాచ్‌ను సీజ్ చేసి ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజక్షన్ల వల్లే మృత్యువునకు గురయ్యారనే అనుమానం వ్యక్తమవుతోంది.

Odisha: కోరాపుట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఆరుగురు మృతి

బంధువుల ఆవేదన – స్థానికుల ఆందోళన
అధికారులు మృతుల బంధువులతో సంప్రదింపులు జరిపి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పది మంది వైద్య బృందం పోస్ట్ మార్టం ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పరిస్థితిని నియంత్రించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు సిబ్బందిని మోహరించారు. ఆసుపత్రి న్యాయమైన విచారణకు హామీ ఇచ్చినప్పటికీ, ఈ సంఘటన ఒడిశా(Odisha) కోరాపుట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఆరుగురు మృతిలో ప్రజారోగ్య సంరక్షణ గురించి చాలా కాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. దక్షిణ ఒడిశా( Odisha) కోరాపుట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఆరుగురు మృతికు కీలకమైన వైద్య సదుపాయమైన SLNMCH, సిబ్బంది కొరత, అస్థిరమైన వైద్య విధానాలు, సరిపోని మౌలిక సదుపాయాలపై గతంలో విమర్శలను ఎదుర్కొంది.ఈ ఘటన ప్రభుత్వ ఆసుపత్రులలోని మందుల భద్రత, వైద్యుల శ్రద్ధలపై ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు రేకెత్తించింది. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి, ఈ ప్రమాదానికి బాధ్యులను శిక్షించాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Read Also: Delhi : ఢిల్లీలో క్లీన్ ఫ్యూయల్ బస్సులకే అనుమతి

Breaking News in Telugu due to botched injection Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Six people died in Koraput hospital Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.