📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shubman Gill: తీవ్ర ఒత్తిడిలో మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) పేర్కొన్న విధంగా, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోవడమే గెలుపు దూరమయ్యే కారణమైందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సెట్ అయిన బ్యాటర్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారని, ఆ దశలో వేగంగా వికెట్లు పడిపోవడం జట్టుకు అనుకూలంగా లేదన్నారు. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ప్రదర్శించిన పోరాటం, ఓటమిని తప్పించేందుకు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు.ఈ టెస్ట్ ఆదివారం మాంచెస్టర్ వేదికగా ముగిసింది. మ్యాచ్ చివరి రోజున టీమిండియా జట్టు (Team India team) గట్టి పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా మలచడంలో విజయవంతమైంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా చేసిన అసాధారణ బ్యాటింగ్, ఒత్తిడిలో గట్టి ప్రదర్శన చేసి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాయి. శుభ్‌మన్ గిల్ ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లను ప్రత్యేకంగా ప్రశంసించారు.

జట్టు సమావేశంలో

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్ తమ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. తీవ్ర ఒత్తిడిలో తమ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. ‘మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. వికెట్లు పడితే సమీకరణం మారే పరిస్థితి నెలకొంది. ఐదో రోజు వికెట్‌పై ఏం జరుగుతుందో? అనే ఆందోళన నెలకొంది. ప్రతీ బంతి కీలకంగా మారింది. మేం ప్రతీ బంతిని ఆడుతూ, ఆటను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. జట్టు సమావేశంలో అదే మాట్లాడుకున్నాం.రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీలకు చేరువయ్యారు. వారి పోరాటానికి గుర్తింపుగా శతకాలు పూర్తి చేసుకోవాలని భావించాం.ఈ క్రమంలోనే ముందుగా డ్రాకు అంగీకరించలేదు. ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి సెషన్ వరకు జరుగుతుంది. చాలా నేర్చుకున్నాం.

Shubman Gill: తీవ్ర ఒత్తిడిలో మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు

తొలి ఇన్నింగ్స్‌లో

ఒక జట్టుగా ఈ సిరీస్ మాకు ఎన్నో విషయాలను తెలియజేసింది. తదుపరి మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయాలనుకుంటున్నాం. నిజాయితీగా చెప్పాలంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు. వైట్ జెర్సీ ధరించి దేశం తరఫున బరిలోకి దిగిన ప్రతీ సారి కొంత కంగారు ఉంటుంది.అది దేశం కోసం ఆడటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. నేను బ్యాటింగ్‌ చేసే ప్రతీ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా. నా బ్యాటింగ్‌ను వీలైనంత మేరకు ఆస్వాదించాలనుకుంటాను. తొలి ఇన్నింగ్స్‌లో మేం మెరుగైన స్కోర్ చేశాం. కానీ మా బ్యాటర్లలో చాలా సెట్ అయిన తర్వాత ఔటయ్యారు. ఈ తరహా వికెట్లపై సెట్ అయిన బ్యాటర్లు భారీ స్కోర్లు చేయడం ముఖ్యం. దురదృష్టవశాత్తు అది జరగలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నాం. బుమ్రా ఫిట్‌నెస్ గురించి వేచి చూడాలి. మేం మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి పట్టించుకోం.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

శుభ్‌మన్ గిల్ ఎప్పుడు పుట్టాడు?

శుభ్‌మన్ గిల్ 8 సెప్టెంబర్ 1999న పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పుట్టాడు.

శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ శైలి ఏంటి?

గిల్ రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అతని ఆట శైలిలో గ్రేస్, టెక్నిక్,కాంట్రోల్ ఉన్నాయి. లాంగ్ ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం అతనికి ప్రత్యేకత.

Read Hindi News : hindi.vaartha.com

Read also : IND vs ENG: రిషభ్ పంత్ ప్రతిభను కొనియాడిన గంభీర్

Breaking News Gill Press Meet India vs England Test Indian Test Captain latest news Manchester Test Draw Ravindra Jadeja Shubman Gill Team India Cricket Washington Sundar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.