📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Shubhanshu Shukla : అంతరిక్షంలో రైతుగా శుభాన్షు శుక్లా..

Author Icon By Sudha
Updated: July 10, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పరిశోధనల్లో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు. తాజాగా అంతరిక్షంలో శుభాన్షు రైతు అవతారమెత్తారు (space farmer). మెంతి, పెసర విత్తనాలు వేసి పెంచుతున్నారు. చిన్నపాటి గాజు పాత్రల్లో వాటిని పెంచుతున్నారు. జీరో గ్రావిటీ వాతావరణంలో ఈ మొక్కల పెరుగుదల ఎలా ఉంటుందోనన్న దానిపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లోని ప్రత్యేక స్టోరేజీ ఫ్రీజర్‌లో వాటిని ఉంచి అవి మొలకెత్తే విధానాన్ని ఫొటోలు తీశారు. ఈ పరిశోధనలో ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రవికుమార్ హోసమణి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు శుక్లాకు (Shubhanshu Shukla) సహకరిస్తున్నారు. యాత్ర ముగించుకుని భూమికి తిరిగి వచ్చాక.. ఈ మొలకల్లోని జన్యు మార్పులు, పోషక విలువలను విశ్లేషించనున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ తెలియజేసింది. వ్యవసాయ ప్రయోగాలతో పాటు శుభాన్షు శుక్లా మరిన్ని కీలక పరిశోధనలు కూడా చేస్తున్నారు.

Shubhanshu Shukla : అంతరిక్షంలో రైతుగా శుభాన్షు శుక్లా..

ప్రయోగాలపై ఉత్సాహం

అంతరిక్షంలో జరుగుతున్న శాస్త్రీయ ప్రయోగాలపై శుభాన్షు ఉత్సాహంతో ఉన్నారు. భారతదేశం చేపడుతున్న ప్రయోగాలపై ఆయన ప్రత్యేక ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆక్సియం స్పేస్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ లూసీ లోవ్ బుధవారం ఆక్సియం-4 మిషన్‌లోని సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా తాను చేస్తున్న శాస్త్రీయ ప్రయోగాల గురించి సమాచారం అందించారు. తాను చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నామని.. అంతరిక్ష కేంద్రంలో చాలా ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల ఇస్రో సహకారంతో పనిచేస్తోందని.. ఈ విషయంలో తాను చాలా గర్వపడుతున్నానన్నారు.

శుభాన్షు శుక్లా ర్యాంక్?

వైమానిక దళ కెరీర్. 2025 నాటికి, శుక్లా గ్రూప్ కెప్టెన్ హోదాను కలిగి ఉన్నారు. అతను సుఖోయ్ Su-30MKI, MiG-21, MiG-29, SEPECAT జాగ్వార్, BAE హాక్, డోర్నియర్ 228, మరియు ఆంటోనోవ్ An-32 వంటి అనేక రకాల విమానాలలో 2,000 గంటలకు పైగా విమానయాన అనుభవం కలిగిన అర్హత కలిగిన టెస్ట్ పైలట్.

శుభాన్షు శుక్లా అర్హత ఏమిటి?

శుభాన్షు శుక్లా కంప్యూటర్ సైన్స్ మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రెండింటిలోనూ బలమైన విద్యా నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (M.Tech) డిగ్రీని పొందాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Breaking News: ట్రంప్ పై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నం ?

Breaking News farming in space Indian astronaut latest news shubhanshu shukla space agriculture space farmer Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.