📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: చారిత్రాత్మక క్షణం రేపే!

Author Icon By Shobha Rani
Updated: June 10, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) రేపు జరగనున్న యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించనున్నారు. ఇది భారత అంతరిక్ష చరిత్రలో విశేష స్థానం దక్కించుకునే ఘట్టం. భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడనుంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చారిత్రాత్మక యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ ప్రయోగానికి భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. వాస్తవానికి ఈ వారం ప్రారంభంలో జరగాల్సిన ఈ ప్రయోగం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రేప‌టికి వాయిదా ప‌డింది. రేపు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు (అమెరికా కాలమానం ఉదయం 8:00) యాత్ర‌ ప్రారంభం అవుతుంది.
అత్యధిక పరిశోధనలు ఉన్న మిషన్
యాక్సియమ్-4 మిషన్‌లో శుభాంశు శుక్లా లా(Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించనున్నారు. 1984లో రాకేశ్‌ శర్మ చారిత్రాత్మక అంతరిక్ష యాత్ర తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండవ భారతీయుడిగా శుక్లా లా(Shubhanshu Shukla) నిలవనున్నారు. అంతేకాకుండా 25 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా కూడా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఈ మిషన్‌కు అమెరికాకు చెందిన అనుభవజ్ఞురాలైన వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇది ఆమెకు ఐదో ఐఎస్‌ఎస్ యాత్ర కావడం విశేషం. వీరితో పాటు పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నీవ్‌స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టులుగా తొలిసారి అంతరిక్షంలోకి పయనిస్తున్నారు. భారతదేశం (1984), పోలాండ్ (1978), హంగేరీ (1980) దేశాలు గతంలో ఒక్కొక్క వ్యోమగామిని మాత్రమే అంతరిక్షంలోకి పంపాయి. ఇప్పుడు ఈ మూడు దేశాలు మళ్లీ మానవసహిత అంతరిక్ష యాత్రలు చేపడుతుండటంతో ఈ మిషన్‌కు “రియలైజ్ ది రిటర్న్” (తిరిగి సాధించు) అనే నినాదాన్ని ఇచ్చారు.

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: చారిత్రాత్మక క్షణం రేపే!

శుభాంశు శుక్లా ప్రస్థానం
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రస్థానం 2019లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి వచ్చిన పిలుపుతో మొదలైంది. ఆ తర్వాత ఆయన మాస్కోలోని స్టార్ సిటీలో ఉన్న యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో కఠినమైన శిక్షణ పొందారు. 2025లో ప్రయోగించతలపెట్టిన భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర “గగన్‌యాన్” కోసం శిక్షణ పొందుతున్న వ్యోమగాములలో శుక్లా లా(Shubhanshu Shukla) ఒకరని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరిలో ప్రకటించారు. యాక్సియమ్-4 బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుమారు 14 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో వారు 31 దేశాలకు చెందిన దాదాపు 60 శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన యాక్సియమ్ మిషన్లలో ఇదే అత్యంత ఎక్కువ పరిశోధనలు చేసే మిషన్ కానుంది. ఈ అధ్యయనాలు మానవ ఆరోగ్యం, అంతరిక్ష వాణిజ్యీకరణ, ఇతర కీలక రంగాలకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
మిషన్‌కు ముందు సిద్ధతలు
యాక్సియమ్-4 బృందం రాక కోసం ఐఎస్‌ఎస్‌లోని ఎక్స్‌పెడిషన్ 73 సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ వ్యవస్థలను సిద్ధం చేయడం, టాబ్లెట్ కంప్యూటర్లను యాక్టివేట్ చేయడం, సందర్శక సిబ్బంది కోసం స్లీప్ స్టేషన్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పూర్తి చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే, జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం (డాకింగ్) అవుతుందని అంచనా. ఈ ప్రక్రియను నాసా ఫ్లైట్ ఇంజనీర్లు ఆన్ మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్ పర్యవేక్షిస్తారు. నాసా, స్పేస్‌ఎక్స్ లైవ్ స్ట్రీమింగ్ లింకులు ద్వారా ప్రత్యక్ష ప్రసారం. ఇస్రో మరియు డిడీ నేషనల్ ఛానెల్లలో ప్రత్యేక కార్యక్రమాలు.

Read Also: Los Angeles: ఆందోళనకారులపై యూఎస్‌ మెరైన్స్​ మోహరింపు

#telugu News A historic moment tomorrow! Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Shubhamshu Shukla's space mission: Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.