వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ రద్దయ్యింది. ఈ మ్యాచ్ జూలై 20, 2025న బర్మింగ్‌హామ్ (Barmingham) లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగాల్సి ఉండగా, భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సహా పలువురు ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. “మే 11న తీసుకున్న నిర్ణయానికి నేను ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాను. నా దేశం నాకు సర్వస్వం, దేశం కన్నా గొప్పది ఏదీ లేదు. జై హింద్” అని ఆయన అన్నారు.దీంతో పాటు శిఖర్ ధావన్ తాను తన జట్టుకు పంపిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో, “రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ (World Championship of League of Legends) లో పాకిస్తాన్ జట్టుతో జరిగే ఏ మ్యాచ్‌లోనూ శిఖర్ ధావన్ ఆడరని అధికారికంగా ధ్రువీకరించబడింది. ఈ నిర్ణయం మే 11, 2025న కాల్,వాట్సాప్ చర్చల సమయంలో ఇప్పటికే తెలియజేయబడింది.
మ్యాచ్‌ను రద్దు
ప్రస్తుత పరిస్థితిని,భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను పరిగణనలోకి తీసుకుని శిఖర్ ధావన్ (Shikhar Dhawan) చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు” అని రాసి ఉంది.ఆదివారం(నేడు) జరగాల్సిన భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేశారు. దీనిపై నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ భారత ఆటగాళ్లకు, అభిమానులకు క్షమాపణలు చెప్పారు. “దేశానికి ఇంతటి కీర్తిని తీసుకొచ్చిన భారత క్రికెట్ దిగ్గజాలకు మేము తెలియకుండానే అసౌకర్యాన్ని కలిగించాము. బ్రాండ్ల (Brands) ను కూడా ప్రభావితం చేశాము. ఈ కారణంగానే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని మేము నిర్ణయించుకున్నాము” అని ప్రకటనలో పేర్కొన్నారు.
శిఖర్ ధావన్‌ను ఎందుకు ‘Mr. ICC’ అని ఎందుకు పిలుస్తారు?
శిఖర్ ధావన్‌కు “Mr. ICC” అనే ముద్రపేరు ఎందుకంటే, ఆయన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్లలో అత్యద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్స్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచారు.
శిఖర్ ధావన్ ప్రత్యేకత ఏమిటి?
శిఖర్ ధావన్ ఒక ఎడమచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్గా పేరు తెచ్చుకున్నాడు. అవసరమైన సమయంలో కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Anshul Kamboj: అర్ష్‌దీప్ సింగ్ స్థానాన్ని భర్తీ చేయనున్న అన్షుల్ కాంబోజ్