2019లో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన కీలక తీర్పు వెలువడింది. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 MAX విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ మహిళ శిఖా గార్గ్(Shikha Garg) కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (సుమారు ₹317 కోట్లు) పరిహారం చెల్లించాలంటూ చికాగో ఫెడరల్ కోర్టు ఆదేశించింది. దాదాపు ఆరు సంవత్సరాల పాటు సాగిన న్యాయ పోరాటానికి ఇది పెద్ద విజయంగా భావిస్తున్నారు.
Read Also: Bihar Results: బీహార్ లో ఎన్డీఏ ఉద్యోగావకాశాలను కల్పించగలదా?
ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ
శిఖా గార్గ్(Shikha Garg) ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, యూఎన్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు నైరోబీ వెళ్తుండగా 2019 మార్చిలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించారు. అడిస్ అబాబా బోల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం కూలిపోవడంతో ఆమెతో సహా 150 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు.
ఈ ఘటనకు ఐదు నెలల కిందటే ఇండోనేషియాలో మరో బోయింగ్ 737 MAX ప్రమాదం సంభవించింది. ఆ రెండు ప్రమాదాల్లో కలిపి 340 మంది ప్రాణాలు కోల్పోవడంతో సంస్థపై ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. విమానం మోడల్ డిజైన్‌లో లోపాలు ఉండటమే ప్రమాదాలకు కారణమని పలువురు బాధిత కుటుంబాలు ఆరోపించాయి. ప్రయాణికుల భద్రతపై సంస్థ నిర్లక్ష్యం చూపిందంటూ శిఖా కుటుంబం కూడా కోర్టులో దావా వేసింది.
శిఖా గార్గ్ కుటుంబానికి నష్టపరిహారంతో పాటు
చివరకు, శిఖా గార్గ్ కుటుంబానికి నష్టపరిహారంతో పాటు న్యాయవ్యయాలు కలిపి భారీ మొత్తాన్ని చెల్లించాలని అమెరికా ఫెడరల్ జ్యూరీ తీర్పు చెప్పింది. ఈ ఘటనల తర్వాత ప్రపంచంలోని అన్ని 737 MAX విమానాల సర్వీసులను నిలిపివేసి, 2020 డిసెంబర్‌లో మళ్లీ కార్యకలాపాలను పునరుద్ధరించారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్ నుంచి యూకేకు బయలుదేరిన బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిన విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికాడు. విమానం ఒక మెడికల్ కాలేజీ భవనంపై పడ్డ కారణంగా నేలపై ఉన్న మరో 19 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: