📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Sherry Singh: మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ

Author Icon By Aanusha
Updated: October 13, 2025 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశానికి చెందిన షెర్రీ సింగ్ (Sherry Singh) మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 48 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పోటీలలో భారతీయురాలు గెలిచిన తొలి సందర్భం ఇది. షెర్రీ సింగ్ (Sherry Singh) ఘనత సాధించడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు పొందింది.

Read Also: Sresan Pharma: ఎట్టకేలకు దగ్గుమందు కంపెనీ మూత

ఈ ఘనత ఫిలిప్పీన్స్ (Philippines) రాజధాని మానిలాలో జరిగే 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీలలో సొంతమైంది. పోటీల్లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మొత్తం 120 మంది మంది మహిళలు పాల్గొన్నారు. పోటీ అత్యంత గట్టి మరియు కఠినమైనది గా ఉండగా, అందులో షెర్రీ సింగ్ తన ప్రతిభ, సౌందర్యం, ధైర్యం, బుద్ధి ద్వారా కిరీటాన్ని గెలుచుకున్నారు..

9 ఏళ్ల క్రితం షెర్రీ సింగ్‌కు వివాహం కాగా.. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తనకు మిసెస్ యూనివర్స్ కిరీటం దక్కడంపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం తన ఒక్కదానిది మాత్రమే కాదని.. తమ పరిస్థితులను దాటుకుని.. కలలు కనడానికి సాహసం చేసే ప్రతీ మహిళకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు.

మిసెస్ యూనివర్స్ 2025 విజేతగా షెర్రీ సింగ్

ఆత్మవిశ్వాసం, బలం, దయ అనేవి నిజమైన అందాన్ని నిర్వచిస్తాయని తాను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని షెర్రీ సింగ్.. ఉమెన్ ఫిట్‌నెస్ ఇండియా (India) కు తెలిపారు. ఇక మిసెస్ యూనివర్స్ 2025 (Mrs. Universe 2025) విజేతగా షెర్రీ సింగ్ పేరును ప్రకటించినప్పుడు ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.

Sherry Singh

షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ కిరీటం సాధించడంపై ఆమె మెంటర్, నేషనల్ డైరెక్టర్ ఊర్మిమాలా బోరువా స్పందించారు. తాము ఎల్లప్పుడూ షెర్రీ సింగ్ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉంచామని.. ఆమె సాధించిన చారిత్రక విజయం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. తన దేశానికి గౌరవంగా,

ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం

ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతీ మహిళకు షెర్రీ సింగ్ ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసిందని ప్రశంసలు గుప్పించారు. 48 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. మిసెస్ యూనివర్స్ కిరీటం చివరికి ఇంటికి తిరిగి వచ్చిందని యూఎంబీ పేజెంట్స్ (UMB Pageants) ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పోటీలో విజేతలుగా గుర్తించడానికి గ్రాండ్ ఫినాలేలో కేవలం బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలకు కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్లుగా పేద నేపథ్యం నుంచి వచ్చిన బాలికల విద్యకు మద్దతు ఇచ్చే అనేక సంస్థలతో కలిసి పనిచేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news mrs universe 2025 sherry singh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.