📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ex PM: బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: January 29, 2026 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికలపై మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మంది కార్యకర్తలను కలిగిన తన రాజకీయ పార్టీ అవామీ లీగ్‌ను బహిష్కరించి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుండటాన్ని ఆమె తప్పుపట్టారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా బ్యాన్ చేసిందని ఆరోపించారు. అన్ని పార్టీలకు పోటీచేసే అవకాశాన్ని ఇవ్వకుండా నిరంకుశంగా నిర్వహించే ఎన్నికల వల్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలం పాటు అస్థిరతను ఎదుర్కోవాల్సి వస్తుందని హసీనా హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల బంగ్లాదేశ్‌లో ప్రజాగ్రహం పెరుగుతుందన్నారు.

Read Also: Maharashtra: బారామతిలో నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు

Ex PM: బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగం

నా పాలనా కాలంలో ప్రజాస్వామ్య ప్రక్రియలను పాటించాను. సజావుగా ఎన్నికలను నిర్వహించాను. అన్ని పార్టీలకూ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని ఇచ్చాను. ఎందుకో అప్పట్లో చాలా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించేందుకే ప్రాధాన్యత ఇచ్చేవి. అవి ఎన్నికల్లో పాల్గొనేవి కావు. అలా చేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగం కావాలి’. ‘అవామీ లీగ్ అనేది బంగ్లాదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీ. దానిపై బ్యాన్‌ను విధించి, అతికొద్ది పార్టీలతో ఎన్నికలను నిర్వహించడం చట్ట వ్యతిరేకం.

కొంతమంది వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న కోర్టు

‘నేను నిరంకుశంగా బంగ్లాదేశ్‌ను పాలించాననే విమర్శల్లో వాస్తవికత లేదు. ప్రభుత్వ భద్రతా సంస్థలతో రాజకీయ ప్రత్యర్ధులను కిడ్నాప్ చేయించి, చంపించాననే ఆరోపణలన్నీ అబద్ధాలు. నా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వారిని మర్డర్ చేయించాను అనేది కూడా అబద్ధం. ఈ తప్పుడు ఆరోపణల ప్రాతిపదికన బంగ్లాదేశ్‌లోని ఒక కోర్టు నాకు మరణశిక్షను విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అది కొంతమంది వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న కోర్టు. దాని నుంచి ఇప్పుడు అలాంటి ఆదేశాలే వస్తాయి. ఈ ఆదేశాల న్యాయబద్ధతపై పలు అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏవిధమైన విచారణ, సాక్ష్యాధారాల ప్రాతిపదికన ఈ ఆదేశాలను ఇచ్చారని అవి ప్రశ్నించాయి’ అని షేక్ హసీనా పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Awami League Bangladesh Elections Bangladesh politics Bangladesh Prime Minister election statements Political comments Sheikh Hasina Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.