📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Shaik Haseena: షేక్ హసీనా 1,400 సార్లు మరణశిక్షలకు అర్హురాలు ..చీఫ్ ప్రాసిక్యూటర్

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Shaik Haseena) కు మరణశిక్ష విధించాలని ఆ దేశానికి చెందిన ప్రభుత్వ న్యాయవాదులు డిమాండ్ చేశారు. నిరుడు బంగ్లాదేశ్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఆందోళనను అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం అణచివేసింది. అనంతరం ఆమె అధికారం కోల్పోయారు. భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా అమానుష నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఆందోళనకారులపై “మారణాయుధాలను వినియోగించాలి” అని భద్రతా బలగాలను ఆమె ఆదేశించినట్టు లీకైన ఓ ఆడియో క్లిప్‌లో ఉంది. కానీ ఈ అభియోగాలను ఆమె తిరస్కరించారు. 1971లో ఆ దేశ స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత జరిగిన అత్యంత హింసాత్మ ఘటనగా ఇది నిలిచింది. హసీనా 1,400 సార్లు మరణశిక్షలకు అర్హురాలని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లామ్ అన్నారు.

Read Also: PAK VS AFG: పాకిస్థాన్ పై అఫ్గానిస్థాన్ దాడి ఏడుగురు మృతి

shaik haseena: షేక్ హసీనా 1,400 సార్లు మరణశిక్షలకు అర్హురాలు ..చీఫ్ ప్రాసిక్యూటర్

తీవ్రమైన నేరస్థురాలిగా మారిన హసీనా

“అయితే, ఇది సాధ్యం కాదు కాబట్టి.. అందులో ఒక్క మరణశిక్షయినా విధించాలని డిమాండ్ చేస్తున్నాం” అని తాజుల్ ఇస్లామ్ అన్నారు. “అధికారాన్ని తన కోసం, తన కుటుంబం కోసం శాశ్వతం చేసుకోవడమే హసీనా లక్ష్యంగా ఉండేది” అని తాజుల్ గురువారం కోర్టుకు తెలిపారు. “ఆమె తీవ్రమైన నేరస్థురాలిగా మారారు. తాను చేసిన నేరాల విషయంలో ఆమెకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు” అని ఆయన అన్నారు. 1971 నాటి యుద్ధంలో పాల్గొన్న వారి బంధువులకు సివిల్ సర్వీసు ఉద్యోగాల్లో కోటా కల్పించడానికి వ్యతిరేకంగా గత ఏడాది జులైలో నిరసనలు మొదలయ్యాయి. ఇవి తీవ్రరూపం దాల్చి హసీనా తన పదవిని కోల్పోయేందుకు దారి తీసింది.

పోలీసుల కాల్పుల్లో 52 మంది మృతి

ఢాకా పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు ఘటనల్లో పోలీసుల కాల్పుల్లో 52 మంది చనిపోయారు. నిరసనకారుల హింసాత్మక చర్యల కారణంగానే పోలీసులు కాల్పులు మొదలుపెట్టారని హసీనా ప్రభుత్వం నియమించిన డిఫెన్స్ న్యాయవాది వాదించారు. హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలోని హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ చౌధురి అబ్దుల్లా అల్-మామున్‌పై కూడా విచారణ జరుగుతోంది. అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కు కూడా మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. మరోవైపు చౌధురి జులైలో తన నేరాన్ని అంగీకరించారు కానీ, ఆయనకు ఇంకా శిక్ష విధించలేదు.

షేక్ హసీనా తండ్రి ఎవరు?

హసీనా బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె మరియు తుంగిపారా షేక్ రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆగస్టు 1975లో తన తండ్రి హత్యకు ముందు ఆమెకు రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యత లేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bangladesh politics Chief Prosecutor Statement death penalty Latest News Breaking News Political Controversy Sheikh Hasina Telugu News war crimes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.