బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు (Sheikh Hasina)ఆర్నెళ్ల జైలు శిక్ష విధించారు. న్యాయ ప్రక్రియపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ శిక్షను ఖరారు చేసింది.
కోర్టు ధిక్కరణ కేసులో (In a contempt of court case)బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించారు. జస్టిస్ మహమ్మద్ గోలమ్ మోర్తుజా మొజుందార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హసీనా ఫోన్ సంభాషణ లీకైన ఘటన తీవ్ర దుమారాన్ని లేపింది. సోషల్ మీడియాలో ఆ ఫోన్ సంభాషణ లీక్ కావడంతో.. ప్రధాన మీడియా సంస్థలు కూడా ఆ కథనాన్ని ప్రచురించాయి.
గోబిందగంజ్ జిల్లా చైర్మెన్ షాకిల్ అకండ బుల్‌బుల్‌తో ఫోన్‌లో మాట్లాడిన హసీనా (Sheikh Hasina).. తనపై 227 కేసులు ఉన్నాయని, అంటే 227 మందిని చంపే లైసెన్స్ తన దగ్గర ఉన్నట్లు చెప్పింది. ఆ వ్యాఖ్యలను వివాదాస్పదంగా తీసుకున్న ట్రిబ్యునల్.. కోర్టు ధిక్కరణ కేసుగా భావించింది. ఇదే సంభాషణలో పాల్గొన్న బుల్‌బుల్‌కు రెండు నెలల జైలుశిక్ష పడింది. నిందితులు అరెస్టు అయిన తర్వాత లేదా లొంగిపోయిన నాటి నుంచి తీర్పు అమలులోకి వస్తుంది.షేక్ హసీనాకు విధించబడిన శిక్ష అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ వ్యవస్థగాకుండా, సమాజంలో దారితీసిన సంక్షోభానికి జవాబు—ఐతే, ఈ ఘర్షణ తరవాత ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారతాయి అనేది ముఖ్య పరిశీలనలో ఉంది.
Read Also:Sandeep Mathur:దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా అదనపు