📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bangladesh: దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్​: షేక్ హసీనా

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సారథి ముహమ్మద్​ యూనస్​పై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) నిప్పులు చెరిగారు. అతనొక ఫాసిస్ట్​, అవినీతిపరుడైన దేశద్రోహి, హంతకుడని విమర్శించారు. తన స్వార్థం కోసం యూనస్​ దేశాన్ని రక్తమోడించాడని అన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్​ ఒక భయానక అగాధంలో ఉందని, సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్​ ఆసియా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ షేక్ తన ఆడియో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, బంగ్లాదేశ్​ దుస్థితిని వివరిస్తూ యూనస్​పై విమర్శల వర్షం కురిపించారు.

Read Also: America: “అవును నేను నియంతనే”: డొనాల్డ్ ట్రంప్

Bangladesh: దేశాన్ని హింసగుండా నడిపిస్తున్న యూనస్​: షేక్ హసీనా

అవినీతిపరుడైన దేశద్రోహి యూనస్: షేక్ హసీనా

“ప్రస్తుతం ఎక్కడ విన్నా విధ్వంసం మధ్య బతకడానికి పోరాడుతున్న ప్రజల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. అవి ప్రాణాల కోసం చేస్తున్న నిస్సహాయ అభ్యర్థనలు. ఉపశమనం కోసం గుండెలు పగిలేలా వేస్తున్న కేకలు. హంతక ఫాసిస్ట్​, మనీ లాండరర్​, దోపిడీదారుడు, అవినీతిపరుడైన దేశద్రోహి యూనస్​. అతను తన స్వార్థపూరిత పోకడలతో దేశాన్ని రక్తమోడించాడు. మన మాతృభూమి (బంగ్లాదేశ్​) ఆత్మకు మచ్చ తెచ్చాడు.” అని షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు.

భయం నీడలో ప్రజలు

‘ప్రస్తుతం బంగ్లాదేశ్​లో తీవ్రమైన అరాచకత్వం, అభద్రత రాజ్యమేలుతున్నాయి. మైనారిటీలు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా మూక దాడులు, లూటీలు, తీవ్రవాదం వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ బలహీనపడ్డాయి. న్యాయం కరువైంది. జాతీయ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారు. సామాన్య ప్రజల దైనందిన జీవితం భయం నీడలో కొనసాగుతోంది’ అని హసీనా పేర్కొన్నారు. “ఈ సంక్షోభ సమయంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి అందరూ ఏకం క కావాల్సిన అవసరం ఉంది అని షేక్ హసీనా అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bangladesh politics Bangladesh Violence government criticism Muhammad Yunus opposition politics Political Allegations Sheikh Hasina Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.