📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shardul Thakur: గిల్ కెప్టెన్సీపై శార్దూల్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ బౌలింగ్ విభాగం నుంచి అంచనాలకు తగిన ప్రదర్శన రాలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (Zak Crawley), బెన్ డకెట్ అద్భుతంగా రాణించి తొలి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి బలమైన ఆరంభం భారత్‌కు తీవ్ర ఒత్తిడిని కలిగించింది. భారత బౌలర్లు అధిక పరుగులు సమర్పించి, ఇంగ్లాండ్‌కు మ్యాచ్ పై పట్టు లభించేలా చేశారు.ఈ పరిస్థితుల్లో బౌలింగ్ విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ సేవలను సరైన విధంగా వినియోగించుకోలేదని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అతని బౌలింగ్‌కు పూర్తిగా అవకాశం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బౌలింగ్ ఇవ్వడం కెప్టెన్ నిర్ణయం

దీనిపై మ్యాచ్‌ ముగిసిన అనంతరం శార్దూల్ స్పందించారు.భారత బౌలర్ల పేలవ ప్రదర్శనపై శార్దూల్‌ను ప్రశ్నించగా”బౌలింగ్ ఇవ్వడం కెప్టెన్ నిర్ణయం. అది నా చేతిలో లేదు. ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. నేను ఈ రోజు మరో రెండు ఓవర్లు ఎక్కువగా వేయగలిగేవాడిని, కానీ అది కెప్టెన్ నిర్ణయం. ఫామ్‌ను కనుగొనడం కష్టం. కానీ నేను నా అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాను. మేము చేసిన పరుగులు మంచి ప్రయత్నం. బంతి చాలా వేగంగా కదులుతోంది” అని శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) అన్నాడు. అయితే బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయగలిగే వారని ఆయన అంగీకరించారు. “కొత్త బంతితో మేము మెరుగైన ప్రదర్శన చేయగలిగే వాళ్ళం. పరుగులు వస్తూనే ఉన్నాయి. బౌలర్లకు ఇది కష్టం కాదు. మేము సహనంతో ఉండగలిగే వాళ్ళం. ఏ బంతులపై స్థిరంగా ఉండాలో మేము అంచనా వేయాలి” అని శార్దూల్ పేర్కొన్నాడు.రిషబ్ పంత్ (Rishabh Pant) గాయంపై కూడా శార్దూల్ ఠాకూర్ మాట్లాడాడు. “ఈ రోజు రిషబ్ పంత్ బస్సులో రాలేదు ఎందుకంటే అతను ఆస్పత్రిలో ఉన్నాడు.

అద్భుతమైన ఆరంభం

మేము వార్మప్ చేస్తున్నప్పుడు పంత్ మైదానంలో లేడు. అతని కాలికి గాయమైందనే సంగతి ఇదివరకే తెలిసిందే.” అని శార్దూర్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.భారత్ మొదట బ్యాటింగ్ చేసి 114.1 ఓవర్లలో 358 పరుగులు చేసింది. దానికి సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ అర్ధశతకాలు సాధించారు. జాక్ క్రాలీ 113 బంతుల్లో 84 పరుగులు చేయగా బెన్ డకెట్ (Ben Duckett) 100 బంతుల్లో 94 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగుల వెనుకబడి ఉంది. మూడో రోజు భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకోవాలి. లేకపోతే మ్యాచ్ భారత్ చేజారిపోతుంది.

శార్దూల్ ఠాకూర్‌ను “లార్డ్” అని ఎందుకు పిలుస్తారు?

శార్దూల్ ఠాకూర్ క్రికెట్‌లో అంచనాలు లేకుండానే కీలక సమయంలో మ్యాచ్‌లను తానే ఒక్కరే తారుమారు చేయగల ఆటగాడిగా నిలుస్తుంటాడు. అనూహ్య ప్రదర్శనలతో ప్రత్యర్థులపై ప్రభావం చూపడంతో అభిమానులు అతనిని సరదాగా “లార్డ్ శార్దూల్” అని పిలవడం ప్రారంభించారు. ఇది ఒకరకంగా ప్రేమతో కూడిన నిక్‌నేమ్‌ (nickname).

“లార్డ్” అనే ట్యాగ్ ఎలా వచ్చింది?

2021లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో శార్దూల్ కీలకమైన వికెట్లు తీయడం, అనుకోని సమయంలో రన్స్ చేయడం వంటి అద్భుత ప్రదర్శనల తరువాత సోషల్ మీడియాలో “లార్డ్ శార్దూల్” అనే పేరు వైరల్ అయింది. ఈ పేరును అభిమానులు, క్రికెట్ మిమ్స్ పేజీలు విస్తృతంగా వాడారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Hulk Hogan: WWE దిగ్గజం హల్క్ హోగన్ ఇకలేరు!

4th test match Ben Duckett India vs England indian bowlers poor performance jack crawley latest news Manchester Test shardul thakur statement subhman gillBreaking News Team India bowling Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.