📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

China: షాంఘైలో కుంగిన భూమి..సమీప భవనాలపై ప్రభావం

Author Icon By Vanipushpa
Updated: February 13, 2026 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలోని షాంఘై(Shanghai)లో అనూహ్య సంఘటన సంభవించింది. ఓ రోడ్డు మొత్తం కుంగిపోయింది. రహదారిపై హఠాత్తుగా భారీ గొయ్యి ఏర్పడింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రద్దీ రోడ్డు అది. ఓ భాగం మొత్తాన్ని కూడా భూమి కబళించివేసింది. ఇంత పెద్ద మొత్తంలో భూమి కుంగిన ప్రభావం సమీప భవనాలపై పడింది. వాటికీ నష్టం వాటిల్లింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని ఒరిగిపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. రోడ్డును రెండు వైపులా నిలిపివేసి, దాని పక్కనే నిర్మాణ పనులు కొనసాగిస్తోన్న దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో చూడొచ్చు. ఒకవైపు నిర్మాణ సామాగ్రి, తాత్కాలిక షెల్టర్లు, మరోవైపు పదుల సంఖ్యలో కార్మికులు అక్కడి సైట్ లో పని చేస్తోండటం ఇందులో రికార్డయింది. అదే సమయంలో ఉన్నట్టుండి భూమి కుంగింది. తొలుత రోడ్డు మొత్తం బీటలు వారింది. ఆ తర్వాత ఓ భారీ గుంత ఏర్పడింది. భూమి కుంగుతున్నప్పుడు కన్ స్ట్రక్షన్ సైట్ లో ఉన్న భారీ నిర్మాణ సామాగ్రి మొత్తం అందులో పడిపోయాయి.

Read Also: Change of Districts : జిల్లాల మార్పు పై సీఎం రేవంత్ క్లారిటీ

China: షాంఘైలో కుంగిన భూమి..సమీప భవనాలపై ప్రభావం

పట్టణాల్లో మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన

చైనాకూ, మనకూ ఎంత తేడా ?” షాంఘైలో భూమి కుంగిపోవడం సాధారణం. ఇక్కడి మెత్తటి ఒండ్రు నేలలు, భూగర్భ జలాల వెలికితీత పనులు, నేలకింద పలచటి ఇసుక పొరలు, పాత మౌలిక సదుపాయాలే దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి- చిన్నపాటి గుంతలు మొదలుకుని ఇటువంటి భారీ కుంగుబాటులకు దారితీస్తాయని అంటున్నారు. తాజా ఘటన జనసాంద్రత గల పట్టణాల్లో మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన పెంచింది. 2024 జనవరిలో షాంఘైలోని మిన్‌హాంగ్ జిల్లాలో మురుగునీటి పైపు పగిలిపోవడంతో రహదారి దాదాపు 10 మీటర్లు కుంగింది. 2017 నుంచి 2023 వరకు చైనా వ్యాప్తంగా భూమి కుంగిపోయిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Building Safety Concerns China Infrastructure News Ground Collapse Shanghai Shanghai Land Subsidence Soil Erosion Issues Telugu News Paper Telugu News Today Urban Development China

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.