📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bangalore: కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

Author Icon By Vanipushpa
Updated: January 22, 2026 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ ఐటీ రాజధాని నగరం బెంగళూరు(Bangalore) కెంపెగౌడ (Kempegowda) అంతర్జాతీయ విమానాశ్రయంలో కొరియా మహిళపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. తనిఖీల పేరుతో మహిళా టూరిస్ట్‌పై గ్రౌండ్ స్టాఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు మహ్మద్ అఫాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ కిమ్ సంగ్ క్యుంగ్ విమానాశ్రయంలో తనకు జరిగిన దారుణాన్ని ఓ జాతీయ మీడియాకు ఇిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. కొరియాకు వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి కిమ్ సంగ్ చేరుకున్నారు.

Read Also: Dragon: 6G యుద్ధాన్ని రహస్యంగా మొదలెట్టిన చైనా

Bangalore: కొరియా మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులు

వ్యక్తిగత తనిఖీ పేరుతో లైంగిక వేధింపులు

ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మహ్మద్ అఫాన్ అనే గ్రౌండ్ స్టాఫ్ ఆమెను సంప్రదించాడు. ఆమె లగేజీల నుంచి ‘బీప్ బీప్’ అనే శబ్దం వచ్చిందని, వ్యక్తిగత తనిఖీ చేయాల్సి ఉంది పక్కకు రావాలని చెప్పాడు. అది నిజమేనని నమ్మిన ఆమె… అతడి నీచమైన ఆలోచన తెలియక వెంట వెళ్లింది. అఫాన్ ఆమెను పురుషుల వాష్‌రూమ్ దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ అనుచితంగా ప్రవర్తించాడని కిమ్ సంగ్ క్యుంగ్ తెలిపారు. వృత్తిపరంగా, సీరియస్‌గా వ్యవహరించడంతో ఆమెకు అనుమానం రాలేదు. అనంతరం ఆమెను ప్రయివేట్ భాగాలపై చేతులు వేస్తూ అసభ్యంగా తాకాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

crime against women Korean woman incident Latest News in Telugu Sexual Harassment Case staff misconduct Telugu News online Telugu News Today women safety issues workplace harassment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.