📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News: Canada: ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయిస్తున్న భారతీయ దంపతులు

Author Icon By Vanipushpa
Updated: December 11, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం కెనడా(Canada)లో నివసిస్తున్న భారతీయ సంతతి దంపతులు దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబీ, హిందీ మాట్లాడే వర్గాలకు చెందినవారు.. కొడుకులను కనేందుకు ఆసక్తి చూపిస్తూ.. గర్భంలో ఉన్నది ఆడపిల్లా, మగ పిల్లాడా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. అక్కడితో ఆగకుండా గర్భంలో ఉన్నది అమ్మాయి అని తెలిస్తే.. అబార్షన్లు చేయించుకుంటున్నట్లు ఓ కొత్త పరిశోధన వెల్లడించింది. ‘జర్నల్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కెనడా’లో ప్రచురించబడిన ఈ నివేదిక.. ఈ అంశంపై కెనడాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also: Vikram Singh: ఇండిగో  విమానాల రద్దుపై  క్షమాపణ చెప్పిన ఛైర్మన్

Canada

విపరీతంగా పెరిగిన గర్భస్రావాల సంఖ్య

పరిశోధకులు ఏప్రిల్ 1993 నుంచి మార్చి 2014 మధ్య అంటారియో ఆసుపత్రుల్లో జన్మించిన 46,834 మంది భారతీయ సంతతి తల్లుల ప్రసవ రికార్డులను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో భాగంగా.. ఇప్పటికే ఇద్దరు కూతుర్లు ఉన్న భారతీయ వలసదారులైన మహిళల్లో మగ, ఆడ పిల్లల నిష్పత్తి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా పంజాబీ, హిందీ మాతృ భాషగా ఉన్న తల్లులలో ఈ తేడా స్పష్టంగా కనిపించింది. అలాగే గతంలో జరిగిన గర్భస్రావాల సంఖ్య విపరీతంగా పెరగడంతో.. మగ పిల్లాడి పట్ల పక్షపాతం బలపడుతోందని పరిశోధన తేల్చింది. ఇది లింగ నిర్ధారణ పద్ధతులకు నిదర్శనంగా పేర్కొంది.

నడాలో నివాసంతోనూ మార్పు లేదు

ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశం ఏంటంటే.. భారతీయ వలసదారులైన తల్లులు కెనడాలో ఎంత కాలం నివసించినా.. మూడో బిడ్డ జననం విషయంలో మగ, ఆడ పిల్లల నిష్పత్తిలో సమతుల్యత ఏర్పడలేదు. ఈ పరిస్థితి ప్రధానంగా పంజాబీ మాట్లాడే మహిళలు, కొంతవరకు హిందీ మాట్లాడే మహిళల్లోనే కనిపిస్తోంది. ఈ ఫలితాలు భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో ఉన్న అధిక లింగ నిష్పత్తికి అనుగుణంగా ఉన్నాయి. మగ పిల్లల ప్రాధాన్యత, స్త్రీలపై వివక్ష వంటి సాంస్కృతిక అంశాలు ఈ కమ్యూనిటీల్లో సంతానోత్పత్తి నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Female Foeticide Gender Discrimination Gender Equality Google News in Telugu Indian society Latest In telugu news Legal Policies Sex-Selective Abortion Social issues Women’s Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.