📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం!

Author Icon By Shobha Rani
Updated: May 9, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం(pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ తర్వాత పాక్ కూడా ప్రతీకార చర్యలను స్టార్ట్ చేసింది. భారత్‌-పాక్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ పంపిన 50కి పైగా డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేసింది. అయితే ఈ తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఏగుడురు ఉగ్రవాదులను బీఎస్‌ఎఫ్ ( BSF) బలగాలు కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఏడుగురు ఉగ్రవాదులకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) తో సంబంధం ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిన్నాయి.

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం!

డ్రోన్లతో దాడుల ప్రయోగం – సరిహద్దు ఉలిక్కిపడింది
మే 8న రాత్రి 11 గంటల ప్రాంతంలో సాంబా సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్‌ దళాలు ఈ చర్యను ప్రారంభిచినట్టు సమాచారం. ఇక శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉగ్రవాదలు చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి.. ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు BSF తన ఎక్స్‌ “X” ఖాతా ద్వారా వెల్లడించింది.
భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. గురువారం జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుకొని పాకిస్తాన్ చేసిన దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి దూసుకొచ్చిన సుమారు 50పైగా డ్రోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది.
జాతీయ భద్రతపై తీవ్ర నిఘా – ప్రజల అప్రమత్తత అవసరం
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్ సిందూర్ పేరుతపాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లొని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడుడు జరిపింది. ఈ దాడిలో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. ఈ దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత.. ఈ ఉగ్రవాద చొరబాటు చర్య జరిగినట్టు తెలుస్తోంది.

Read Also: Mehbooba Mufti: మహిళలను, పిల్లలను ఎందుకుచంపుతున్నారు? మెహబుబా ముఫ్తీ కంటతడి

Breaking News in Telugu Google news Google News in Telugu Jammu and Kashmir! Latest News in Telugu Paper Telugu News Seven terrorists killed in Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.