📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Sergio Gore: భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం

Author Icon By Aanusha
Updated: October 12, 2025 • 9:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టిందని, ఈ మార్పుకు ప్రధాన కారణం ఇరు దేశాల బలమైన నాయకత్వమని అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) అన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రాయబారిగా గోర్‌ను నియమించగా, ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించకముందే ఢిల్లీలో పర్యటిస్తూ కీలక సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

America : మరోసారి అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

38 ఏళ్ల వయసులోనే రాయబారిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా గోర్ (Sergio Gor) అమెరికా చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన రాయబారిగా రికార్డు సృష్టించారు. ట్రంప్‌ (Donald Trump) కి సన్నిహిత మిత్రుడిగా పేరుపొందిన ఆయన, గతంలో అమెరికా రాజకీయ వ్యవస్థలో పలు కీలక పదవులు చేపట్టారు. దౌత్యవేత్తగా ఆయన నియామకం భారత్-అమెరికా సంబంధాలకు నూతన దిశనివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అక్టోబర్ 9న ఢిల్లీ చేరుకున్న సెర్గియో గోర్ (Sergio Gor), తన ఆరు రోజుల పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలతో సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కీలక ఖనిజాల వంటి అంశాలపై ఫలప్రదమైన చర్చలు

ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధన భద్రతకు అవసరమైన కీలక ఖనిజాల వంటి అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా, ట్రంప్ పంపిన ఒక ప్రత్యేక బహుమతిని గోర్ ప్రధాని మోదీకి అందించారు.

గతంలో వైట్‌హౌస్‌ (White House) లో ఇరువురు నేతలు కలుసుకున్నప్పటి ఫొటోపై “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు” అని ట్రంప్ స్వయంగా రాసి సంతకం చేసి పంపారు.సమావేశం అనంతరం గోర్ మాట్లాడుతూ, “ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా జరిగింది. భారత్‌తో ఉన్న బంధాన్ని అమెరికా ఎంతో విలువైనదిగా భావిస్తుంది.  

Sergio Gore

స్వయంగా రాసి సంతకం చేసి పంపారు

అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీని ఒక గొప్ప, వ్యక్తిగత మిత్రుడిగా భావిస్తారు. నేను ఢిల్లీ బయలుదేరడానికి ముందు కూడా ఇద్దరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వారి మధ్య ఈ సంప్రదింపులు రానున్న రోజుల్లోనూ కొనసాగుతాయి.

ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను,” అని తన అధికారిక ప్రకటనలో తెలిపారు.సోవియట్ యూనియన్‌ (Soviet Union) లో జన్మించి అమెరికా పౌరసత్వం పొందిన సెర్గియో గోర్, ట్రంప్ ప్రభుత్వంలో వైట్‌హౌస్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా పనిచేసి అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా పేరుపొందారు.

గోర్ నియామకం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది

ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడంలో భారత్ పాత్రను ట్రంప్ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో గోర్ నియామకం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. అయితే, వాణిజ్య సుంకాలు, హెచ్‌1బీ వీసాల వంటి అంశాలు ఇరు దేశాల మధ్య సవాలుగా మారే అవకాశం ఉంది.ఈ నెల 14న గోర్ తన పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లనున్నారు.

ఆయన పర్యటన, మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో “మోదీ-ట్రంప్ 2.0” శకానికి నాంది పలుకుతోందని, ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వానికి దోహదపడుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Donald Trump India US relations latest news PM Modi Sergio Gor ambassador Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.