📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Russia: భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

Author Icon By Vanipushpa
Updated: February 12, 2026 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. అయితే ఈ ఒప్పందంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అమెరికా ప్రకటించిన ఏకఫక్ష ఫ్యాక్ట్ షీల్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇండియాపై సుంకాల కోతలకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో ఉన్న కొన్ని పప్పుధాన్యాలు అనే పదాలను వైట్ హౌస్ తన పాఠ్యం నుంచి తొలగించింది. ఇది మాత్రమే కాకుండా యుఎస్ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసే విషయంలో ఉపయోగించిన భాషను కూడా మార్చింది. తొలుత భారతదేశం కట్టుబడి ఉంది (commits) అని పేర్కొనగా.. తాజా సవరణలో అదే వాక్యం భారతదేశం ఉద్దేశించింది (intends)గా మారింది. ఇక ఈ పరిస్థితులు ఇలా ఉంటే రష్యా నుంచి భారత్ ఆయిల్ ఇకపై కొనుగోలు చేయదని ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై రష్యా స్పందించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov) ఈ అంశంపై Trump మీద విరుచుకుపడ్డారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని అనే మాటలను ఖండించారు.

Read Also: Adilabad: ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి 

Russia: భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

ఇప్పటివరకు న్యూఢిల్లీ ఎలాంటి ప్రకటన చేయలేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప మరెవరూ ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. మాస్కోలోని రష్యా పార్లమెంటు దిగువ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బుధవారం లావ్రోవ్ ఈ విధంగా స్పందించారు. న్యూఢిల్లీ నుంచి మాస్కోకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ అందలేదని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ గానీ.. ఇతర భారతీయ నాయకులు గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని లావ్రోవ్ గుర్తు చేశారు. జనవరి 1 నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్.. ఈ ఏడాది చివర్లో శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఆ సదస్సులో ఇంధన భద్రత కీలక అంశంగా ఉండనుందని ఇప్పటికే సంకేతాలు ఉన్నాయి. భారత్ నిర్వహించబోయే ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత ప్రధాన అంశంగా ఉండనుందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఆ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా లావ్రోవ్ తెలిపారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు మాస్కో అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. అవసరమైతే వాటిని మరింత బలోపేతం చేయడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన ఉద్ఘాటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

bilateral cooperation diplomatic ties foreign policy news India Russia friendship India Russia Relations International Relations Sergey Lavrov statement Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.