📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

One Big Beautiful Bill Act : ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు సెనేట్ ఆమోదం

Author Icon By Sudheer
Updated: July 2, 2025 • 7:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ (One Big Beautiful Bill Act) కు తాజాగా అమెరికా సెనేట్ ఆమోదం లభించింది. ఓట్లలో 50-50తో సమం కావడంతో, నిర్ణయాత్మకంగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఓటు వేసి ఉత్కంఠానికి ముగింపు పలికారు. ఈ పరిణామంతో బిల్లు జూలై 4న ప్రతినిధుల సభ (House of Representatives) ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే, ఈ బిల్లు అధికారికంగా చట్టంగా మారి అమల్లోకి రానుంది.

ట్రంప్ అభివృద్ధి అజెండాకు బిల్లు ఆధారం

ఈ బిల్లులో ట్రంప్ (Donald Trump ) పాలనకు ప్రాతినిధ్యం వహించే అంశాలైన ట్యాక్స్ కట్స్ (పన్ను తగ్గింపులు), బోర్డర్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఖర్చులు, ఎనర్జీ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రత్యేకంగా అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం, ఆధునిక సర్వైలెన్స్ టెక్నాలజీ కోసం $70 బిలియన్లు, డిఫెన్స్ అవసరాల కోసం $150 బిలియన్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడానికి కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

వ్యతిరేకతల మధ్య ముందుకెళ్తున్న బిల్లు

ఈ బిల్లుపై దేశంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే, ఈ బిల్లులో వైద్యం, విద్య, సామాజిక సంక్షేమ ఖర్చులను తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి. దీని వల్ల కోట్లాది మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ట్రంప్ వర్గం మాత్రం ఈ బిల్లు ద్వారా అమెరికా ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రత బలోపేతం అవుతుందని నమ్ముతోంది. ఇప్పుడు ప్రతినిధుల సభ తీర్పే ఈ బిల్లు భవిష్యత్తును నిర్ణయించనుంది.

Read Also : Modi 5 Nation Tour : నేటి నుంచి ప్రధాని 5 దేశాల టూర్ స్టార్ట్

# Donald Trump Google News in Telugu One Big Beautiful Bill Act us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.