సాధారణంగా ఏ దేశ పార్లమెంట్ (Parliament)లో అయినా గందరగోళం సర్వసాధారణమే. అధికార పక్షం నిర్ణయాలపై నిరసన తెలియజేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తుంటారు. అయితే, ఆ ఆందోళనలు ఒక్కోసారి ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ పరిస్థితి వెళ్తుంది. తాజాగా తుర్కియే(Turkey) పార్లమెంట్‌లో అదే జరిగింది. చట్టసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య జరిగిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా
ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన అకిన్ గుర్లెక్ ను ఆ దేశ కొత్త న్యాయశాఖ మంత్రిగా అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నియమించారు. దీంతో ఆయన పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, శక్తిమంతమైన న్యాయశాఖకు గుర్లెక్‌ను నియమించడం ఆ దేశంలోని ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (CHP)కి నచ్చలేదు. ఆయన నియామకాన్ని వ్యతిరేకించారు. గుర్లెక్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
కొత్తగా న్యాయశాఖ మంత్రిగా నియామకమైన అకిన్ గుర్లెక్ గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన రాజకీయ పక్షపాతంతో ఉన్నారని ఆరోపించారు. గుర్లెక్ ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో ఇస్తాంబుల్ మేయర్ , ప్రతిపక్ష నేతలపై గతంలో రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అతన్ని న్యాయశాఖ మంత్రిగా నియమించడంపై ప్రతిపక్ష నేతలు భగ్గుమన్నారు. పోడియం వద్దకు దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఘర్షణ చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: