📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Scott Bessant: పుతిన్‌తో చర్చలు విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు: స్కాట్‌ బెస్సెంట్‌

Author Icon By Sudha
Updated: August 15, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య శుక్రవారం అలాస్కాలో జరగనున్న చర్చలు విఫలమైతే భారత్‌పై అదనంగా మరోసారి (Plus once again)అమెరికా ప్రభుత్వం సుంకాలు విధిస్తుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ (Scott Bessant) హెచ్చరించారు. బుధవారం బ్లూమ్‌బర్గ్‌ టీవీతో ఆయన మాట్లాడుతూ ట్రంప్‌, పుతిన్‌ మధ్య అలాస్కాలో జరగనున్న చర్చలు అనుకూల ఫలితాలు సాధించడంలో విఫలమైన పక్షంలో భారత్‌పై అదనపు సుంకాలు వడ్డించక తప్పదని ఆయన అన్నారు.

Scott Bessant: పుతిన్‌తో చర్చలు విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు: స్కాట్‌ బెస్సెంట్‌

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనంగా సుంకాలు విధించామని, పరిస్థితి తమకు అనుకూలంగా లేకపోతే భారత్‌పై మరోసారి అదనపు సుంకాలు విధించడమో లేదా ఆంక్షలు విధించడమో తమ ప్రభుత్వం చేపడుతుందని స్కాట్‌ (Scott Bessant) హెచ్చరించారు. భారత్‌పై మొదట 25 శాతం సుంకాలు విధించిన అధ్యక్షుడు ట్రంప్‌.. రష్యా నుంచి చమురును, ఆయుధాలను కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 శాతం సుంకాలను జరిమానాగా విధించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న రష్యాకు భారత్‌ పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా విధించిన సుంకాలు మొత్తంగా 50 శాతానికి పెరిగిపోవడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధించడాన్ని అన్యాయం, అసంబద్ధంగా భారత్‌ అభివర్ణిస్తూ తమ జాతీయ ఇంధన భద్రత కోసం చమురు దిగుమతులు అనివార్యమని సమర్థించుకుంది.

స్కాట్ బెసెంట్ నేపథ్యం?

ఆయన గతంలో సోరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ (SFM)లో భాగస్వామిగా ఉన్నారు. కీ స్క్వేర్ గ్రూప్‌ను స్థాపించారు, ఇది ఒక ప్రపంచ స్థూల పెట్టుబడి సంస్థ. కాన్వే, సౌత్ కరోలినా, US బెసెంట్ 1984లో యేల్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1991లో, ఆయన సోరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ ద్వారా నియమించబడ్డారు, చివరికి దాని లండన్ కార్యాలయానికి అధిపతి అయ్యారు.

స్కాట్ కుటుంబం ఏ జాతికి చెందినది?

స్కాట్ ఇంటిపేరు స్కాటిష్ అని నమ్ముతారు, ఇక్కడ ఇది ఇప్పటికీ అత్యంత సాధారణ ఇంటిపేర్లలో ఒకటి. స్కాట్ తరచుగా స్కాట్లాండ్ నుండి వచ్చిన వారికి ఇవ్వబడుతుందని భావిస్తున్నారు. చాలా అరుదుగా స్కాట్ అనే ఇంటిపేరు స్కౌట్ లేదా గూఢచారి యొక్క పాత ఫ్రెంచ్ వర్ణన నుండి రావచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/america-trump-putin-meeting-today/international/530616/

Breaking News India Tariffs International Relations latest news putin Scott Bessant Telugu News Trade Talks US India relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.