📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Saudi Arabia: ‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

Author Icon By Saritha
Updated: March 9, 2026 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Saudi Arabia: సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాలపై జరిగిన క్షిపణి దాడి ఘటనలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడంటూ వచ్చిన వార్తలను అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా ఖండించింది. ఈ ఘటనలో భారతీయులెవరూ ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేస్తూ.. బాధితుల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది.

Read Also: War in West Asia: పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

Saudi Arabia: ‘No Indians died in Saudi attack’.. Embassy clarifies

ఒక భారతీయుడికి గాయాలు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సమీపంలోని అల్ ఖర్జ్ గవర్నరేట్‌పై ఆదివారం సాయంత్రం ఒక సైనిక ప్రొజెక్టైల్ వచ్చి పడింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు మరణించారని, వారిలో ఒకరు భారతీయుడు, మరొకరు బంగ్లాదేశీయుడు అని సౌదీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రాథమిక సమాచారం ఇచ్చింది. అయితే మృతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సౌదీ అధికారులు తమ నివేదికను సవరించారు.

చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా బంగ్లాదేశ్‌కు చెందిన వారేనని.. మృతుల్లో భారతీయులెవరూ లేరని తాజా విచారణలో తేలింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఈ భీకర దాడిలో మొత్తం 12 మంది గాయపడగా.. వారిలో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు ఎంబసీ ధృవీకరించింది. సదరు వ్యక్తికి ప్రస్తుతం అల్ ఖర్జ్ లోని స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Al Kharj missile strike Gulf War Indian Embassy Riyadh Indian injured in Saudi Saudi Arabia attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.