📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Gold: సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!

Author Icon By Vanipushpa
Updated: January 16, 2026 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా చమురు (Oil) సంపదకు పెట్టింది పేరు సౌదీ అరేబియా. అయితే ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. సౌదీ అరేబియా(Saudi Arabia) లోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో కళ్లు చెదిరే స్థాయిలో బంగారు నిక్షేపాలు (gold mines) ఉన్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సుమారు 78 లక్షల ఔన్సుల పసిడి నిక్షేపాలు కొత్తగా కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మైనింగ్ సంస్థ ‘మాడెన్’ వెల్లడించింది. ఎక్కడెక్కడ ఈ బంగారు నిధులు ఉన్నాయి? మాడెన్ సంస్థ చేపట్టిన విస్తృతమైన డ్రిల్లింగ్, అన్వేషణలో ఈ భారీ నిధులు వెలుగు చూశాయి. ముఖ్యంగా నాలుగు ప్రాంతాల్లో ఈ బంగారం ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.. ఇక్కడే అత్యధికంగా 30 లక్షల ఔన్సుల అదనపు నిక్షేపాలు బయటపడ్డాయి.

Read Also: Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

Gold: సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!

వాడి అల్ జౌ (Wadi Al Jaww):

ఈ కొత్త ప్రాంతంలో సుమారు 38 లక్షల ఔన్సుల బంగారం ఉండవచ్చని అంచనా. ఉరుక్, ఉమ్ అస్ సలాం: ఈ రెండు ప్రాంతాల నుంచి కలిపి మరో 16.7 లక్షల ఔన్సుల పసిడి లభించింది. ఈ ఆవిష్కరణలతో సౌదీ అరేబియాలోని అరేబియన్ షీల్డ్ ప్రాంతంలో ఇంకా అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని స్పష్టమవుతోంది. బంగారమే కాదు.. రాగి, నికెల్ కూడా! సౌదీ అరేబియా కేవలం బంగారు నిధుల తోనే ఆగడం లేదు. జబల్ షైబాన్, జబల్ అల్ వకీల్ వంటి ప్రాంతాల్లో జరిపిన డ్రిల్లింగ్‌లో భారీగా రాగి, నికెల్, ప్లాటినం వంటి విలువైన లోహాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.

ప్రపంచ పసిడి మార్కెట్‌లో సౌదీ అరేబియా పాత్రను కీలకం

దీనివల్ల సౌదీ అరేబియా కేవలం చమురుపైనే కాకుండా, మైనింగ్ రంగం ద్వారా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకోనుంది. ఈ తాజా ఆవిష్కరణలు ఆ దేశ ఆదాయాన్ని భారీగా పెంచడమే కాకుండా ప్రపంచ పసిడి మార్కెట్‌లో సౌదీ అరేబియా పాత్రను మరింత కీలకం చేయనున్నాయి. మాడెన్ సీఈఓ బాబ్ విల్ట్ మాట్లాడుతూ.. “ఈ ఫలితాలు మా దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సౌదీలో మరిన్ని బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి మేము భారీగా పెట్టుబడులు పెడుతూనే ఉంటాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సౌదీలో అతి పెద్ద బంగారు గనులు దొరకడం హాట్ టాపిక్ గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Economic impact news Global gold market Gold reserves news Middle East resources Mining news Natural resources Saudi Arabia gold discovery Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.