📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News: Satya Nadella: ఖాళీ టైంలో ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ ఆవిష్కరణ చేసిన సత్య నాదెళ్ల

Author Icon By Vanipushpa
Updated: December 12, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా ఎవరైనా ఫ్రీ టైమ్‌ దొరికితే రిలాక్స్ అవుతారు లేదా హాబీస్‌కి కేటాయిస్తారు. కానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) మాత్రం తన ఫ్రీ టైమ్‌లో కోడింగ్ చేస్తున్నారట! ఆయనకు టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమో, క్రికెట్ అన్నా అంతే అభిమానం. ఈ రెండు ఇష్టాలను కలిపి ఆయన ఒక అదిరిపోయే పని చేశారు. అదేంటంటే.. క్రికెట్ హిస్టరీని విశ్లేషించేందుకు ముఖ్యంగా క్రికెట్‌ ను డీప్‌గా అనాలైజ్ చేసేందుకు సత్య నాదెళ్ల స్వయంగా ఒక ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ను రూపొందించారు. అది కూడా ఆయన ఖాళీగా ఉండే టైంలో ఈ పని చేసేవారట. అంటే టెక్నాలజీ మీద ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు లీడర్ గా సింపుల్ గా ఉంటూనే మరోవైపు ఆయన కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. AI సాయంతో ‘ఆల్-టైమ్ గ్రేట్’ టీమ్ ఎంపిక ఇండియన్ టెస్ట్ క్రికెట్‌ లో ఆల్-టైమ్ గ్రేట్ టీమ్‌ను ఎంపిక చేయడానికి.. సత్య నాదెళ్ల ఈ కొత్త AI యాప్‌ను ఉపయోగించారట.

Read Also: Elon Musk: ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

Satya Nadella

ఒక క్రికెట్ టీమ్ కోసం భారీ మొత్తంలో పెట్టుబడి

ఈ యాప్ ఒక క్రికెట్ ఆటగాడి గురించి పూర్తి విశ్లేషణ, చర్చలు.. ఇలా అన్ని వివరాలు అద్భుతంగా చూపిస్తుందట. ఈ అనుభవం గురించి నాదెళ్ల మాట్లాడుతూ, “ఈ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది. నిజంగా నాకు కూడా Copilot టీమ్‌లో ఉద్యోగం దొరికితే బాగుండు అనిపించింది” అని బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. కెప్టెన్ ఎంపిక కోసం కూడా ఈ టూల్ రీసెర్చ్ చేసిందట. విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరగగా.. చివరకు ఈ సిస్టమ్ విరాట్ కోహ్లిని బెస్ట్ కెప్టెన్‌ గా ఎంపిక చేసిందట. నాదెళ్లపై క్రికెట్ ప్రభావం సత్య నాదెళ్ల కేవలం క్రికెట్ అభిమాని మాత్రమే కాదు. ఆయన కొన్ని క్రికెట్ టీమ్‌లలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఇతర టెక్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి ఒక క్రికెట్ టీమ్ కోసం భారీ మొత్తంలో (సుమారు $182 మిలియన్లు) పెట్టుబడి పెట్టారు. అసలు విషయం ఏమిటంటే, క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, తన నాయకత్వ లక్షణాలు (Leadership Skills), పట్టుదల, టీమ్ వర్క్‌ ను నేర్చుకోవడానికి క్రికెట్ చాలా ఉపయోగపడిందని సత్య నాదెళ్ల చాలాసార్లు చెప్పారు. ఆయన భారతదేశంలోనే పుట్టి ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా క్రికెట్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI innovation artificial intelligence tools Breaking News in Telugu Deep Research app Google News in Telugu innovation updates Latest In telugu news microsoft technology productivity apps satya nadella Tech News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.