📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Sanjay Manjrekar: కరుణ్ నాయర్‌పై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: July 21, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత బ్యాటర్ కరుణ్ నాయర్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఎనిమిదేళ్ల తర్వాత 2025లో టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన అతను మూడు టెస్ట్‌లలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 131 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ వైఫల్యం నేపథ్యంలో ప్రముఖ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆయనపై విమర్శలు గుప్పించారు.ESPN క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ ఇలా అన్నారు.కరుణ్ నాయర్ స్కోర్లు: 0, 20, 31, 26, 40, 14 — సగటు 21.83 మాత్రమే. అతని గరిష్ఠ స్కోరు లార్డ్స్ టెస్ట్‌లో వచ్చిన 40 పరుగులు.కరుణ్ నాయర్ (Karun Nair) బ్యాటింగ్‌లో చాలా లోటుపాట్లు ఉన్నాయి, ఇవి ఈ సిరీస్‌లో బయటపడిపోయాయి. లార్డ్స్‌లో అతను బ్రైడన్ కార్స్ బంతికి LBW అయ్యాడు.

సాయి సుదర్శన్‌ను ఆడించాలని సూచించాడు

ఔట్ అయిన తర్వాత అతను వాకౌట్ అయినట్లు కనిపించాడు. ఇది మానసికంగా బలహీనతను సూచిస్తుంది,” అని అన్నారు. మరోవైపు తొలి టెస్ట్ మాత్రమే ఆడిన సాయి సుదర్శన్ (Sai Sudarshan) 0, 31 పరుగులే చేశాడు. దాంతో అతన్ని తప్పించి కరుణ్ నాయర్‌ను మూడో స్థానంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడించింది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు.అతన్ని పక్కనపెట్టి సాయి సుదర్శన్‌ను ఆడించాలని సూచించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం సాయి సుదర్శన్‌ను ఎప్పుడూ మూడో స్థానంలోనే ఆడించాలి. తొలి టెస్ట్‌ (first test) లో అతను త్వరగానే ఔటైనా 30 పరుగులతో మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఫ్లాట్‌ ఫిచ్‌లపై బలహీనమైన ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కోవాలంటే, నెంబర్ 3లో యువ ఆటగాడినే ఆడించాలి. కరుణ్ నాయర్‌ను ఎట్టి పరిస్థితుల్లో మూడో స్థానంలో ఆడించవద్దు.

Sanjay Manjrekar: కరుణ్ నాయర్‌పై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు..ఎందుకంటే?

సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే

సీనియర్ ఆటగాడైన కరుణ్ నాయర్‌కు మరో అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించవచ్చు. కానీ మూడో స్థానంలో మాత్రం సాయి సుదర్శన్ మాత్రమే ఆడాలి.’అని సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) చెప్పుకొచ్చాడు.ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో 2-1తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే..బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకం. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. రిషభ్ పంత్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

సంజయ్ మంజ్రేకర్ జీవిత చరిత్ర పేరు ఏమిటి?

సంజయ్ మంజ్రేకర్ బొంబాయి తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి హర్యానాపై అర్ధ సెంచరీ సాధించాడు. 1987లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2018లో, అతను ముంబైలో ‘ఇంపర్ఫెక్ట్ ‘ అనే తన ఆత్మకథను ప్రారంభించాడు, ఇది అతని క్రికెట్ కెరీర్, అతని జీవితం. బ్యాటింగ్ టెక్నిక్ పట్ల అతని మక్కువ గురించి మాట్లాడుతుంది.

సంజయ్ మంజ్రేకర్ క్రికెట్ కెరీర్ గురించి?

సంజయ్ మంజ్రేకర్ టెస్ట్ క్రికెట్‌లో 37 మ్యాచ్‌లు ఆడి 2043 పరుగులు చేశాడు. వన్డేల్లో 74 మ్యాచ్‌ల్లో 1994 పరుగులు చేశాడు. టెస్ట్‌లో రెండు సెంచరీలు, వన్డేలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. స్టయిలిష్ టెక్నికల్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Anderson- Tendulkar: తన పేరుతో ట్రోఫీ నిర్వహించడంపై జేమ్స్ అండర్సన్ ఏమన్నారంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.