Indian student death USA : అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది. కాలిఫోర్నియాలోని బర్కిలీలో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన అతడు మృతిచెందినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆదివారం అధికారికంగా ధ్రువీకరించింది.
ఫిబ్రవరి 12 ఉదయం నుంచి సాకేత్ కనిపించడం లేదని సమాచారం అందడంతో స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లేక్ అంజా సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సాకేత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. అంతకు ముందు ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు.
Read Also: Winter Olympics: ఒలింపిక్స్ లో కండోమ్స్ కొరత
“భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబానికి మా సానుభూతి,” అని భారత కాన్సులేట్ పేర్కొంది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కుటుంబానికి సహాయం అందిస్తామని తెలిపింది.
సాకేత్‌ను చివరిసారిగా లేక్ అంజా ప్రాంతంలో చూసినట్లు పోలీసులు వెల్లడించారు. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: