📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాదే :జైశంకర్‌

Author Icon By Anusha
Updated: March 7, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లండన్‌ పర్యటనలో ఒకేసారి ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు, కశ్మీర్‌ వేర్పాటువాదులకు సమాధానం ఇచ్చిన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ లండన్‌ పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగిస్తే కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. లండన్‌లో ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పాక్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుంచి దొంగిలించిన భూభాగాన్ని తిరిగి అప్పగించినప్పుడే సమస్య ముగుస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు

జైశంకర్‌ లండన్‌లోని ఛాఠమ్‌ హౌస్‌లో అధికారిక సమావేశాలు ముగించుకున్న తర్వాత, బయట ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు నిరసనకు దిగారు. ఖలిస్తాన్‌ జెండాలతో నినాదాలు చేశారు. ఓ వ్యక్తి విదేశాంగ మంత్రి కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చి, భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించేలా ప్రవర్తించాడు. అప్రమత్తమైన లండన్‌ పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బ్రిటన్‌ హెచ్చరిక

ఈ ఘటన అనంతరం బ్రిటన్‌ ప్రభుత్వం ఖలిస్తాన్‌ వాదులను హెచ్చరించింది. తమ దేశంలో శాంతియుత నిరసనలకు మాత్రమే అనుమతి ఉందని, హింసాత్మక చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల అరాచకంపై మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని లండన్‌ పోలీసులు తెలిపారు.

370 రద్దు

జైశంకర్‌ మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇటీవల అక్కడ అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిసినట్టు వివరించారు. ప్రజలకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం అందించామని చెప్పారు.లండన్‌ పర్యటనలో ఒకేసారి ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు, కశ్మీర్‌ వేర్పాటువాదులకు సమాధానం ఇచ్చిన జైశంకర్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై భారత ప్రభుత్వ ఉద్ధేశాన్ని మరోసారి స్పష్టం చేశారు.అక్కడ అసెంబ్లీ ఎన్నికలను కూడా విజయవంతంగా ముగించినట్టు చెప్పారు. కశ్మీర్‌ ప్రజలకు ఆర్ధికాభివృద్ది, సామాజిక న్యాయాన్ని అందించినట్టు ప్రకటించారు.ఆర్టికల్ 370ని తొలగించడం అనేది ఒక ముఖ్యమైన అడుగు అని నేను అనుకుంటున్నాను. తరువాత, కాశ్మీర్‌లో వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడం. ఇది రెండవ అడుగు, ఎన్నికలు నిర్వహించడం, ఇది మూడవ అడుగు కోసం చాలా ఎక్కువ ఓటింగ్‌తో జరిగింది. మనం ఎదురుచూస్తున్న భాగం కాశ్మీర్‌లో ఆక్రమిత భాగాన్ని తిరిగి ఇవ్వడం అని నేను భావిస్తున్నాను. ఇది చట్టవిరుద్ధమైన పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. అది పూర్తయినప్పుడు, నేను మీకు హామీ ఇస్తున్నాను. కాశ్మీర్ పరిష్కరించబడింది.” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు జైశంకర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగమని పునరుద్ఘాటించారు. ప్రతి భారతీయ రాజకీయ పార్టీ POK భారతదేశానికి తిరిగి వచ్చేలా చూసుకోవడానికి కట్టుబడి ఉందని చెప్పారు.

#Article370 #ChathamHouse #india #IndiaUKRelations #Jaishankar #KashmirIssue #Khalistan #KhalistaniProtest #London #PakistanOccupiedKashmir #POK #UKPolice Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.