📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: S Jaishankar- రష్యా కంపెనీలకు భారత్‌ రెడ్‌ కార్పెట్‌

Author Icon By Sudha
Updated: August 21, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా నుంచి చమురు కొనుగోలు కారణం చూపి భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ సుంకాలు (50 శాతం) విధించిన విషయం తెలిసిందే. భారత్-అమెరికా మధ్య రష్యా చమురు దిగుమతులపై ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ -రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లోని కంపెనీల్లో పెట్టుబడులు (Investments)పెట్టాలని రష్యా కంపెనీలను ఆహ్వానించారు. మాస్కోలో బుధవారం జరిగిన భారత్–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) పాల్గొన్నారు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ డెనిస్‌ మంటురోవ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడంతోపాటు వివిధ అంశాల్లో సహకరించుకోవాలని ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సూచించారు. ‘ఎక్కువ చేయాలి, భిన్నంగా చేయాలి’ అన్నదే ఇరు దేశాల వాణిజ్యమంత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

S Jaishankar : రష్యా కంపెనీలకు భారత్‌ రెడ్‌ కార్పెట్‌

గత నాలుగేళ్లలో భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందని జైశంకర్‌ (S Jaishankar)స్పష్టం చేశారు. కానీ ఆ పెరుగుదలతో పాటు భారీ అసమతుల్యత కూడా ఉత్పన్నమైందని వ్యాఖ్యానించారు. ‘2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న రెండు దేశాల వాణిజ్యం 2024–25లో 68 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, 2021లో 6.6 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఇప్పుడు 59 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే తొమ్మిది రెట్లు పెరిగింది. దీనిని తక్షణమే పరిష్కరించుకోవాలి’ అని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని ఆయన గుర్తుచేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి కొత్త ద్వారాలు తెరిచిందన్నారు. భారత్‌లో రష్యా కంపెనీల వ్యాపార విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందన్నారు.

జై శంకర్ అర్హతలు?

జైశంకర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆయనకు రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మరియు ఎం. ఫిల్ మరియు పిహెచ్‌డి పట్టాలు ఉన్నాయి.

జైశంకర్ తమిళుడా?

జైశంకర్ అసలు పేరు శంకర్. కుంభకోణం నుండి వచ్చారు, కానీ తిరునెల్వేలిలో తల్లిదండ్రులు సుబ్రమణియన్ అయ్యర్, తిరునెల్వేలి కోర్టు న్యాయమూర్తి మరియు యోగాంబాల్ దంపతులకు జూలై 12, 1938న జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/no-need-for-radhas-ideology-on-lipulekh-pass/national/533466/

Breaking News India Foreign Policy India Russia Relations latest news Red carpet policy Russian companies in India S Jaishankar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.