📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ryanair : పెరిగిన జీతాన్ని తిరిగి ఇవ్వండి: రయన్‌ఎయిర్

Author Icon By Shobha Rani
Updated: May 24, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ రయన్‌(Ryanair) ఎయిర్ తన సిబ్బందికి షాకిచ్చింది. ఇటీవల పెంచిన జీతాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. జీతాల పెంపు ద్వారా ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.8 లక్షల వరకు అందుకున్నారని, ఆ మొత్తాన్ని వెంటనే కంపెనీ ఖాతాలో జమ చేయాలని పేర్కొంది. లేదంటే నెలనెలా జీతంలో కోత పెడతామని స్పష్టం చేసింది. జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగ సంఘంతో కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని కోర్టు తీర్పు ఇవ్వడంతో కంపెనీ ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
లాభపడ్డ ఉద్యోగులపై ఆర్థిక భారం
రయన్(Ryanair) ఎయిర్ ఉద్యోగులకు సంబంధించి రెండు యూనియన్లు ఉన్నాయి. అందులో ఒకటైన ‘సీసీఓఓ’తో రయన్ఎయిర్ వేతన పెంపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు సిబ్బంది జీతాలను పెంచింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రత్యర్థి సంఘం ‘యూఎస్ఓ’ కోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన కోర్టు.. జీతాల పెంపునకు సంబంధించి ‘సీసీఓఓ’తో రయన్ఎయిర్ కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని తీర్పు వెలువరించింది. దీంతో జీతాల పెంపు ద్వారా అందుకున్న సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని రయన్ఎయిర్ తన సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.

Ryanair : పెరిగిన జీతాన్ని తిరిగి ఇవ్వండి: రయన్‌ఎయిర్

కోర్టు తీర్పు కారణంగా నోటీసులు
ఈ పరిణామంపై యూఎస్ఓ కార్మిక సంఘం ప్రతినిధి ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్ మాట్లాడుతూ.. కంపెనీ నోటీసులపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. వేతన పెంపునకు సంబంధించిన ఒప్పందంపై చర్చలు జరిపిన వారికి, తమ సభ్యుల తరఫున సంతకాలు చేసే అధికారం లేదని ఆరోపించారు. కంపెనీ తమ సంఘంలోని సభ్యులను సీసీఓఓలో చేరాలని ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. మరోవైపు, రయన్‌(Ryanair) ఎయిర్ ప్రతినిధి మాట్లాడుతూ, యూఎస్‌ఓ జీతాలు తగ్గించాలని కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం ఆ కేసు అప్పీల్‌లో ఉంది. మేము కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాము అని తెలిపారు. ఈ పరిణామం Ryanair ఉద్యోగుల మౌలిక హక్కులు, వేతన భద్రతలపై పెద్ద ప్రశ్నలే లేవనెత్తుతోంది. జీతం పెరిగిందని ఆనందించిన ఉద్యోగులు… ఇప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటే, ఇది ఆర్థికంగా, మానసికంగా తట్టుకోలేనంత భారంగా మారే అవకాశం ఉంది.

Read Also: Walter Ladwig: భారత్–పాక్ సరికొత్త ఘర్షణ వాతావరణం: వాల్టర్ లాడ్విగ్ విశ్లేషణ

Google news Return increased salary Ryanair : Telugu News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.