📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Russian Army – రష్యా సైన్యం ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం

Author Icon By Sudha
Updated: September 11, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కొందరు భారతీయులు రష్యా సైన్యం (Russian Army) తరఫున పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం తమ తరపున పోరాడేందుకు బలవంతంగా వినియోగించుకుంటోందంటూ పలువురు బాధితులు ఇప్పటికే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రం తాజాగా స్పందించింది. ఈ మేరకు కీలక సూచన చేసింది. రష్యా సైన్యం(Russian Army) ఆఫర్లు ప్రమాదకరమని హెచ్చరించింది. భారతీయులు రష్యా సైన్యం(Russian Army)లో చేరొద్దంటూ సూచించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Russian Army – రష్యా సైన్యం ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం

రష్యా సైన్యంలో భారతీయ పౌరులను (Indian nationals) నియమించుకున్నట్లు వస్తున్న నివేదికలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు ప్రకటనలో తెలిపారు. రష్యాసైన్యంతో పనిచేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించిందని చెప్పారు. రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న వారిని వెనక్కి పంపించాలని కోరుతూ మాస్కో అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బాధిత కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచంలో రష్యా సైన్యం ఎంత బలంగా ఉంది?

రష్యన్ సాయుధ దళాలు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సైనిక దళం , దాదాపు ఒక మిలియన్ యాక్టివ్-డ్యూటీ సిబ్బంది మరియు దాదాపు రెండు మిలియన్ల మంది రిజర్విస్టులు ఉన్నారు.

రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ సైన్యం ఎంత పెద్దది?

భూ బలగాల విషయానికి వస్తే, ఉక్రెయిన్ వద్ద కేవలం 1,117 పదాతిదళ పోరాట వాహనాలు, 368 ప్రధాన యుద్ధ ట్యాంకులు మరియు 268 సాయుధ సిబ్బంది వాహకాలు మాత్రమే ఉన్నాయి, అయితే రష్యా వద్ద 17,677 పదాతిదళ పోరాట వాహనాలు మరియు 17,370 ప్రధాన యుద్ధ ట్యాంకులు మరియు 14,991 సాయుధ సిబ్బంది వాహకాలు ఉన్నాయి.

అమెరికా లేదా రష్యాలో ఎవరు శక్తివంతమైనది?

రెండు దేశాలు సైనిక ఆవిష్కరణలు, పోరాట భాగస్వామ్యం మరియు ప్రపంచ ప్రభావం యొక్క సుదీర్ఘ చరిత్ర కలిగిన అణు సూపర్ పవర్స్. US ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్ మరియు సాటిలేని ప్రపంచ ప్రాప్యతను కలిగి ఉండగా, రష్యా భూ ఆధిపత్యం మరియు అణు నివారణపై దృష్టి సారించే శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/charlie-charlies-murder-causes-a-stir-in-america/international/545179/

army recruitment Breaking News india russia news indian government International Relations latest news russian army Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.