📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Russia: డిసెంబర్ లోనే పుతిన్ భారత్ పర్యటనలో ప్రత్యేకత ఏమిటి?

Author Icon By Sushmitha
Updated: December 3, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గత నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నా యుద్ధం మాత్రం ఆగడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన మొండిపట్టును వీడడం లేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా 20 సూత్రాల ప్రణాళికతో ఉక్రెయిన్-రష్యాలు అంగీకరించాలని పేర్కొన్నారు. దీనికి రెండు దేశాలు ఎంతవరకు అంగీకరిస్తాయో తెలియదు కానీ గత నాలుగేళ్లుగా వ్లాదిమిర్ పుతిన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూనే ఉంది. 

Read Also: Cyclone Ditwah Karnataka : బెంగళూరులో భారీ వర్షాల హెచ్చరిక | డిట్‌వా తుఫాన్ ప్రభావంతో యెల్లో అలర్ట్…

Russia What is special about Putin’s visit to India in December?

ఈ నాలుగేళ్లు పుతిన్ పేరు మీడియాలో తరచుగా వినిపిస్తూనే వస్తున్నది.

ఈ వ్లాదిమిర్ పుతిన్ డిసెంబరు 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది చివరిలో కొనసాగింది. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి?

శిఖరాగ్ర సమావేశాల కోసం రానున్న పుతిన్..

గతంలో రష్యా (Russia) అధ్యక్షుడి పర్యటనల చరిత్రను పరిశీలిస్తే.. పుతిన్ (Putin) ఇప్పటివరకు పదిసార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఆయన తొలిసారిగా 2000 అక్టోబర్లో భారత్ ను సందర్శించారు. ఆ సమయంలో రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. అనంతరం వరుసగా డిసెంబరు 2002, డిసెంబరు 2004, జనవరి 2007, మార్చి 2010, డిసెంబరు 2012,డిసెంబరు 2014, డిసెంబర్ 2021లలో భారతదేశాన్ని సందర్శించారు. కొన్ని సందర్భాలు మినహా ఎక్కువగా డిసెంబర్ లోనే భారత్ ను సందర్శించారు. భారత్-రష్యా మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ లో జరగడమే దీనికి ప్రధాన కారణం. రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు శిఖరాగ్ర సమావేశాల కోసమే భారతదేశాన్ని సందర్శించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BilateralTies DefenseDeals DiplomaticTightrope Google News in Telugu IndiaRussiaSummit Latest News in Telugu PostUkraineWarVisit PutinIndiaVisit SpecialStrategicPartnership Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.