📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Russia: భారత్‌కు ఆయిల్ ఇస్తాం.. రష్యా

Author Icon By Saritha
Updated: March 5, 2026 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Russia: పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనల నడుమ రష్యా కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌కు ముడి చమురు సరఫరా చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: West Asia War: ఖతార్, అబుధాబీపై ఇరాన్ డ్రోన్ దాడులు

Russia: We will give oil to India.. Russia

దాడులపై రష్యా ఆగ్రహం

నేడు న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన అలిపోవ్ చమురు సరఫరాదారులు ఎవరనేది నిర్ణయించుకోవాల్సింది భారత నాయకత్వమేని, అయితే రష్యా మాత్రం భారత్‌కు ఆయిల్ ఇచ్చేందుకు ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఘర్షణలపై స్పందిస్తూ, సమస్య ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని అలిపోవ్ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా ఈ ఘర్షణలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో యుద్ధం ఇంకెంత కాలం కొనసాగుతుందని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయం నాకేం తెలుసు? ఈ ప్రశ్నకు సమాధానం నాకంటే అమెరికాకే బాగా తెలుసు” అని ఆయన వ్యంగ్యంగా బదులిచ్చారు. మరోవైపు, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సాయుధ దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. పరిస్థితిని తిరిగి రాజకీయ, దౌత్యపరమైన పరిష్కార మార్గంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Denis Alipov Iran Israel conflict Latest News in Telugu Russia India Oil Trade Telugu News West Asia War 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.