Russia Tsunami: ఈ తెల్లవారుజామున నుంచి పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీరప్రాంతాలను సునామీ తాకింది. తీరం వెంబడి 4 మీటర్ల మేరా అలలు విరుచుకుపడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30దేశాలపై ప్రభావం పడనుంది. ఆమెరికా (America) తీరాన్ని సైతం సునామీ తాకనున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాస్కా, హవాయి, వాషింగ్టన్ తీరంలోని ప్రజలు భయంతో వణికి పోతున్నారు.
సునామీ ముప్పు: భారత పౌరులకు అప్రమత్తంగా ఉండండి
Russia Tsunami: సునామీ ఈరోజు మధ్యాహ్నం సౌత్ కాలఫోర్నియా (Southern California) తీరం తాకనుంది. జపాన్లో 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీస్ కోసం జపాన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. హవాయిలోని హోనోలులులో సునామీ సైరన్లు మోగాయి. తీరప్రాంతంలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారత పౌరులను హెచ్చరించిన భారత్ కాగా సునామీ ముప్పుని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమతీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారతీయులను ఇండియన్ గవర్నమెంట్ హెచ్చరించింది. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీరప్రాంతాలకు దూరంగా ఉండండి..సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
అమెరికా అంతటా హై అలర్ట్
జపాన్ తీరప్రాంతంలోని 9 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చైనాకు కూడా సునామీ ప్రమాదం పొంచి ఉంది. సునామీతోపాటు సైక్లోన్ ప్రమాదం ఉంది. దాంతో షాంఘైలోని 28వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చూనా లో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రపంచవవ్యాప్తంగా పలుదేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. వాటి జాబితాని అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది.
మరి భారత్ పరిస్థితి ఏంటి?
ఈ సునామీతో భారత్కు ఎలాంటి ముప్పు లేదని ఇన్కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) పేర్కొంది. ఇన్కాయిస్ ఈమేరకు ఎక్స్ లో పోస్టు చేసింది. ‘కామ్చాట్ స్కీ తూర్పుతీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. తర్వాత అది సునామీగా మారింది. అయితే, దీని కారణంగా భారత్ కు సునామీ ముప్పులేదు. హిందూ మహాసముద్ర తీరప్రాంతాలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదని ఎక్స్ లో రాసుకొచ్చింది.
రష్యాలో భూకంపాలు వస్తాయా?
తూర్పు రష్యాలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న మూలలో, పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీ నుండి దాదాపు 78 మైళ్ల (126 కి.మీ) దూరంలో, 8.8 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది . యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం 18 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపాలలో ఇది ఒకటి.
రష్యాలో 8.7 భూకంపం ఉందా?
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది, దీని ఫలితంగా సునామీ రష్యన్ తీరంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకుంది. జపాన్ అధికారులు పసిఫిక్ తీరప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేశారు, 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడతాయని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Pahalgam Incident: పాకిస్థాన్ కు అమెరికా షాక్.. స్వాగతించిన భారత్