📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Starlink: స్టార్‌లింక్‌ శాటిలైట్లను కూల్చనున్న రష్యా!

Author Icon By Vanipushpa
Updated: December 23, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ (Starlink) శాటిలైట్‌ కూటమిలో 35956 అనే కృత్రిమ ఉపగ్రహం అదుపుతప్పి భూమి దిశగా కదులుతోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. రష్యా నుంచి మరో ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతరిక్ష కక్షలో తిరిగే వందలాది కృత్రిమ శాటిలైట్లను కూల్చేసేందుకు రష్యా అధునాతన ఆయుధాన్ని కూల్చేసే పనిలో పడిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ది అసోసియేటెట్‌ ప్రెస్ వార్తాసంస్థ ఈ నిఘా సమాచారాన్ని వెల్లడించింది. అంతరిక్షంలో శాటిలైట్‌లపైకి సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి ఆ ఉపగ్రహాలకు నష్టం కలిగించేలా చేయడమే రష్యా ఆయుధం టార్గెట్. ఈ ఆయుధానికి జీరో ఎఫెక్ట్‌ అని పేరు పెట్టినట్లు సమాచారం. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగిస్తే పెద్దసంఖ్యలో శాటిలైట్లను నాశనం చేయొచ్చు.

Read Also: Jakarta: ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం

Starlink

ఐక్యరాజ్య సమితి చొరవ చూపాలి

ఇలాంటి వినాశకర ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము అనుకోవడం లేదని అమెరికాలో ప్రభుత్వేతర సెక్యూర్‌ వరల్డ్‌ ఫౌండేషన్‌లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్‌ అన్నారు. జీరో ఎఫెక్ట్‌ ఆయుధ తయారీ గురించి రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ మాట్లాడారు. కక్షలో తిరిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐక్యరాజ్య సమితి చొరవ చూపాలని అన్నారు. అయితే పుతిన్ గతంలోనే అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మోహరించమని అన్నారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్‌లింక్ శాటిలైట్‌లు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల ఆచూకిని గుర్తించి ఉక్రెయిన్‌కు అందజేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్‌లింక్‌ శాటిలైట్‌లు తమ భద్రతకు ముప్పుగా ఉన్నాయని అందుకే వాటిని నాశనం చేయాలని రష్యా భావిస్తున్నట్లు పశ్చిమాసియా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఒకే కక్షలో శాటిలైట్‌లు అన్నీ కూడా నాశనం

కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్‌ జనరల్‌ క్రిస్టోఫర్‌ హోర్నర్‌ దీని గురించి మాట్లాడారు. ” నింగిలోకి దూసుకెళ్లే రాకెట్ల వంటి వాటినే మనం గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్‌ పొడవు వరకు ఉండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా సిస్టమ్‌లు గుర్తించలేవు. వీటితో శాటిలైట్‌లపై దాడి చేస్తే నష్టాన్ని తప్పించడం చాలా కష్టం. పెల్లెట్ల దెబ్బకు ఒకే కక్షలో శాటిలైట్‌లు అన్నీ కూడా నాశనం అవుతాయి. అంతేకాదు అది దాడి చేసేంది రష్యా అని కనిపెట్టడం కూడా కష్టంతో కూడుకున్న పని. వాషింగ్టన్‌లోని సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ మాట్లాడుతూ శాటిలైట్ల ఉపరితలాల్లో ఎక్కువ ప్రాంతాన్ని సౌర ఫలకాలే ఆక్రమిస్తాయని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Elon musk military technology Paper Telugu News russia Russia Ukraine Conflict Satellite Communication satellite warfare space security SPACEX Starlink Satellites Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.