📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Russia : భారతకు మా చమురు చాలా ముఖ్యం.. రష్యా

Author Icon By Sudha
Updated: October 16, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం ఇంకా ఎంతోకాలం రష్యా (Russia) నుంచి చమురు దిగుమతి చేసుకోబోదని, ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై రష్యా (Russia)స్పందించింది. భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు ఎంతో ముఖ్యమని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. రష్యా (Russia)డిస్కౌంట్‌పై భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్నదని, దాంతో ఆ దేశానికి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని అన్నారు. కాగా రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంగా ట్రంప్‌ భారత్‌పై భారీగా సుంకాలు విధించారు.

Russia : భారతకు మా చమురు చాలా ముఖ్యం.. రష్యా

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంతో ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా సాయపడినట్లు అవుతుందని, కాబట్టి రష్యా చమురును కొనుగోలు చేయడం మానుకోవాలని అమెరికా హెచ్చరిస్తూ వచ్చింది. అయితే అమెరికా హెచ్చరికలను భారత్‌ పట్టించుకోకపోవడంతో అదనపు సుంకాలు వేసింది. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తానని మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్‌ చెప్పడం చర్చనీయాంశమైంది. 2022 తర్వాత, భారతదేశం తన చమురు దిగుమతులలో రష్యా వాటాను భారీగా పెంచుకుంది. కొన్ని నెలల పాటు, రష్యా భారతదేశానికి అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. సౌదీ అరేబియా, ఇరాక్‌లను కూడా అధిగమించింది.

రష్యా ధనిక దేశమా లేక భారతదేశమా?

భారతదేశం రష్యా కంటే ధనిక దేశం కాదు, కానీ దాని మొత్తం ఆర్థిక వ్యవస్థ (GDP) పెద్దది, అయితే రష్యా తలసరి ప్రాతిపదికన ధనిక దేశం. భారతదేశం యొక్క చాలా పెద్ద జనాభా దాని తలసరి ఆదాయం రష్యా కంటే తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.

రష్యా భారతదేశాన్ని రక్షిస్తుందా?

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించడానికి రష్యా కూడా మద్దతు ఇస్తుంది. అదనంగా, భారతదేశం NSG మరియు APECలో చేరడానికి రష్యా గట్టిగా మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, భారతదేశం వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న SAARCలో పరిశీలకుడి హోదాతో చేరడానికి కూడా ఆసక్తిని వ్యక్తం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Crude Oil Energy Security india International Relations latest news Oil Trade russia Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.