భారతదేశానికి రష్యా (Russia) బంపర్ ఆఫర్ ఇచ్చింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన ఎసు-57ను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి షరతులు లేకుండా టెక్నాలజీ ట్రాన్ ఫర్ చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ సీఈవో సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో అన్నారు. రష్యన్ SU ఎసు-57 జెట్లను అమెరికా ఎఫ్-35 జెట్కు పోటీగా భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది.
Read Also: TG: ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రూ.3,200 కోట్లతో భద్రతా కవచం
ట్రంప్ (Trump) అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఎఫ్-35 జెట్లను భారత్ కు అమ్మాలని ప్రయత్నిస్తుంది. ఇటీవల, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్పతిన్ ను కలిసిన తర్వాత రష్యా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇదిలా ఉంటే, డిసెంబరు నెలలో పుతిన్ భారత్ లో సందర్శించనున్నారు. ఈ సమయంలో భారత్-రష్యా మధ్య ఎసయ్ను-57 జెట్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
టెక్నాలజీ బదిలీలో ఎలాంటి పరిమితులు లేవు
భారతదేశానికి రష్యాపూర్తిస్థాయి సాంకేతికత బదిలీతో పాటు భారత్ లోనే ఎసు-57 జెట్లను తయారు చేసేందుకు రష్యా రెడీ అయింది. భారత్ కు టెక్నాలజీ బదిలీలో ఎలాంటి పరిమితులు ఉండవని రష్యా చెబుతోంది. ఇంజన్, రాడార్, స్టెల్త్ టెక్నాలజీ, ఆధునిక ఆయుధాల సమాచారాన్ని కూడా భారత్ కు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 2024లో, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఎస్) ఐదవ తరం స్వదేశీ యుద్ధ విమానాల రూపకల్ప, అభివృద్ధి కోసం 15 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ఆమోదించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: