📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Russia: దేశాధినేతలకు పుతిన్ క్రిస్మస్ గిఫ్ట్లు.. ఏఐ వీడియో వైరల్

Author Icon By Saritha
Updated: December 30, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచమంతా ఇటీవలే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. నూతన సంవత్సర వేడుకలకు కూడా ప్రపంచదేశాలు సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది రష్యా-ఉక్రెయిన్, ఇశ్రాయేల్-హమాస్, భారత్-పాక్ యుద్ధాలు ఊహించని నష్టాలకు గురిచేసింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం కొనసాగుతుంది, త్వరలో రెండుదేశాలు శాంతి ఒప్పందాలకు రానున్నాయి. ఈ పరిస్థితుల్లో (Russia) రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) దేశాధినేతలకు ఇచ్చిన గిఫ్ట్ ఏఐ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చెల్ చేస్తున్నది. పుతిన్ ‘శాంటాక్లాజ్’ వేషధారణలో ఆయా దేశాధినేతలకు గిఫ్ట్లు పంపించారు. భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా బహుమతులు పంపించినట్లుగా వీడియోలో కనిపించింది. ఆయా అధ్యక్షుల పనితీరుకు తగ్గట్టుగా గిఫ్ట్లు ఉన్నట్లుగా వీడియోలో కనిపించింది.

Read Also: Bangladesh: కొడుకు స్వదేశానికి వచ్చిన కొన్ని రోజులకే ఖలీదా జియా మృతి

శాంటాక్లాజ్ వేషధారణలో మెరిసిన పుతిన్

కెన్యాలోని రష్యా కాన్సులేట్ తన ఎక్స్ ఏఐ వీడియో పోస్ట్ చేసింది. అందులో పుతిన్ శాంటాక్లాజ్ వస్త్రాలు ధరించి ఉన్నారు. (Russia) ప్రపంచ దేశాధినేతలకు కానుకలు పంపినట్లుగా ఏఐ వీడియోను రూపొందించారు. పుతిన్ తన స్నేహితులందరికీ ఒక్కొక్క విధమైన బహుమతులు పంపిస్తే జెలెన్ స్కీకి మాత్రం విచిత్రమైన గిఫ్ట్ను పంపించినట్లుగా ఉంది. ఆయాదేశాధినేతలు గిఫ్ట్ తీసుకునే విధానం, వారి ముఖంలో మెరిసిన చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. 

గిఫ్ట్లు ఏవనగా..

తొలుత వీడియోలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కనిపించారు. గిఫ్ట్ ఓపెన్ చేయగానే బీజింగ్, రష్యా కరెన్సీని చిత్రాలు కనిపించాయి. ఇక ట్రంప్-పుతిన్ ఇటీవల అలస్కాలో భేటీ అయిన ఫొటోను కానుకగా పంపినట్లుగా వీడియోలో కనిపించింది. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీకి యుద్ధ విమానాలు కానుకగా పంపించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు కత్తి, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు డీజే సెట్ పంపించగా చివరగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మానరతం భయపెట్టే విధంగా గిఫ్ట్ లో ‘సంకెళ్లు’ ఉన్నట్లు చూపించారు. అంతేకాదు జెలెన్ స్కీ జైల్లో ఉన్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోపై మీరు ఓ కన్నెయ్యండి..

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

international news Latest News in Telugu Modi Trump Xi Gifts Putin Christmas Gifts social media viral video Telugu News Vladimir Putin Santa Claus World Leaders AI Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.