📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ట్రంప్ కు మరో షాక్: భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో రష్యా చమురు ఆఫర్

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా వ్యూహాత్మకంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తోంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను కుదిపేసేందుకు రష్యా(Russia) వ్యూహాత్మకంగా భారత్‌(India)కు వరుస ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పటికే అమెరికా అదనపు సుంకాలు విధించిన చమురును ఇప్పుడు రష్యా చౌకగా అందించేందుకు సిద్ధమైంది.
ఉరల్స్‌ క్రూడ్‌ బ్రెంట్‌ కంటే ఐదు డాలర్లు తక్కువ
డేటా ఇంటెలిజెన్స్ సంస్థ Kpler Limited ప్రకారం, ఉరల్స్ గ్రేడ్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం డేటెడ్ బ్రెంట్ చమురు కంటే ఐదు డాలర్లు తక్కువగా ఉంది. ఇది రెండువారాల క్రితం సమానంగా ఉన్నా, ఇప్పుడు ధర తేడా స్పష్టంగా పెరిగింది.

Trump: ట్రంప్ కు మరో షాక్: భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో రష్యా చమురు ఆఫర్

ప్రభుత్వ రంగ సంస్థలు అప్రమత్తంగా, ప్రైవేట్ కంపెనీలు కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి
భారత్ ప్రభుత్వ రంగ సంస్థలు రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొందరు కొనుగోళ్లు ఆపాలని భావిస్తున్నా, ప్రైవేట్ కంపెనీలు మాత్రం కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి.
రష్యా చమురు మార్కెట్ వాటా 37 శాతం
ప్రస్తుతం భారత ఆయిల్ మార్కెట్‌లో రష్యా వాటా 37 శాతంగా ఉంది. కానీ ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్లు ఆపేస్తే ఈ వాటా బాగా తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు రష్యా చమురు ప్లాంట్ల మెయింటెనెన్స్‌ పనులు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడినుంచి భారీఎత్తున ఆయిల్‌ను ఎగుమతి చేస్తారు. దాని వలన కూడా ఆయల్ ధరలు బాగా తగ్గుతాయని కేపీఎల్ఈఆర్ వివరిస్తోంది.
ప్లాంట్ మెయింటెనెన్స్ కారణంగా రష్యా భారీ ఎగుమతులు
ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య రష్యాలో చమురు శుద్ధి కేంద్రాల్లో మెయింటెనెన్స్ పనులు జరుగనున్నాయి. దీంతో పెద్దఎత్తున చమురు నిల్వలను ఎగుమతి చేసే అవకాశం ఉంది. దాంతో గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు మరింత తగ్గే అవకాశముంది.

భారతదేశం మరియు రష్యా మధ్య కొత్త ఒప్పందం ఏమిటి?
11వ ఇండియా-రష్యా వర్కింగ్ గ్రూప్ సమావేశంలో అల్యూమినియం, ఎరువులు, మైనింగ్ టెక్ మరియు రైల్వేలలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు రష్యా ఒక ప్రోటోకాల్‌పై సంతకం చేశాయి. అమెరికా నుండి భౌగోళిక రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ సెషన్ ద్వైపాక్షిక పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేసింది.

భారతదేశం మరియు రష్యా మధ్య జరిగిన అతిపెద్ద చమురు ఒప్పందం ఏమిటి?
2021లో రష్యా నుండి చమురు కొనుగోలు చేయని భారతదేశం, పుంజుకుంది. అప్పటి నుండి ఇది రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా కొనసాగుతోంది. నేడు ఇది దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ “సోర్”, హెవీ క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటుంది, ఇది దాని ముడి దిగుమతుల్లో 35-40% ప్రాతినిధ్యం వహిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/us-tariffs-kharge-criticism-on-foreign-policy/international/527451/

Cheap crude oil Energy market India Geopolitics Latest News Breaking News Russia India oil deal Russia oil discount Trump Russia India tensions Urals crude vs Brent

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.