📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

రష్యా నూతన చట్టం

Author Icon By sumalatha chinthakayala
Updated: December 18, 2024 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాస్కో: రష్యా పలు సంస్థలపై ఉగ్రవాద ముద్రను తొలగించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రష్యా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉగ్ర సంస్థల ముద్రను రద్దు చేసే అధికారం కోర్టులకు అప్పగించారు. ఈ చట్టాన్ని పార్లమెంటు దిగువ సభ స్టేట్ డూమా ఆమోదించింది. ఈ అంశంపై పలు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. కొత్త చట్టం ప్రకారం, ఒక సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉందని కోర్టు గుర్తిస్తే, ఆ సంస్థలను ఉగ్ర జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల ఆఫ్ఘాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటుదారులతో సంబంధాలను మెరుగుపరచేందుకు మాస్కోకు మార్గం సుగమమవుతుంది.

రష్యా మొదటగా 2003లో ఆఫ్ఘాన్ తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ తర్వాత సిరియా తిరుగుబాటుదారులను కూడా జాబితాలో చేర్చింది. సిరియాలో రెబల్స్ తిరుగుబాటుతో బషర్ అల్-అసద్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వల్ల మాస్కో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. హయత్ తహ్రీర్ అల్ షామ్ (HTS) వంటి సంస్థలను ఉగ్రవాద ముద్ర నుంచి తొలగించాలని కొందరు మాస్కోలో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కో, సిరియాలోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలను బలపరచేందుకు సిద్ధమవుతోంది. క్రెమ్లిన్ సిరియాలోకొత్త ప్రభుత్వంతో ఈ వారంలో చర్చలు జరుపుతోందని అధికార వర్గాలు తెలియజేశాయి.

కాగా, ఫిబ్రవరి 2022లో పుతిన్ ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపిన తర్వాత రాజద్రోహం మరియు గూఢచర్యం కేసులు విపరీతంగా పెరిగాయి. ఈ కేసుల్లో క్రెమ్లిన్‌కు చెందిన అనేక అనుమానిత వ్యక్తులు ఉన్నారు. శాస్త్రవేత్తలకు విమర్శకులు మరియు స్వతంత్ర పాత్రికేయులుచట్టపరమైన సమూహాల దృష్టిని ఆకర్షించడం.

new law russia Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.