Russia India defence : భారత్‌తో ఉన్న వ్యూహాత్మక సంబంధాలకు మేము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని రష్యా మరోసారి స్పష్టం చేసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4–5 తేదీల్లో న్యూఢిల్లీకి రానున్న నేపథ్యంలో, భారత్‌తో కీలక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ స్టేట్ డూమా మంగళవారం ఆమోదం తెలిపింది.
రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ ప్రతిపాదన మేరకు, ఫిబ్రవరి 18న రెండు దేశాల మధ్య కుదిరిన ‘రిసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS)’ ఒప్పందాన్ని గత వారం డూమాకు పంపగా, దానిపై మంగళవారం ర్యాటిఫికేషన్ జరిగింది.
ఈ సందర్భంగా డూమా స్పీకర్ వ్యాచెస్‌లావ్ వోలోడిన్ మాట్లాడుతూ, భారత్‌తో రష్యా సంబంధాలు వ్యూహాత్మకమైనవని, విస్తృతమైనవని తెలిపారు. ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడం పరస్పర సహకారం దిశగా మరో కీలక ముందడుగుగా అభివర్ణించారు.
Latest News: Bandi Sanjay: రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైరింగ్
RELOS ఒప్పందం ద్వారా రష్యా నుంచి భారత్‌కు, భారత్ నుంచి రష్యాకు సైనిక దళాలు, యుద్ధ నౌకలు, సైనిక విమానాలు తరలించే విధానాన్ని స్పష్టంగా నిర్ధేశిస్తుంది. (Russia India defence) అలాగే ఈ కార్యకలాపాలకు అవసరమైన పరస్పర లాజిస్టిక్ మద్దతు ఏర్పాట్లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.
ఈ ఒప్పందం కేవలం సైనిక బలగాలు, పరికరాల రవాణానే కాకుండా, వాటి నిర్వహణ, సరఫరా వ్యవస్థల నియంత్రణను కూడా కలిగి ఉంటుంది. సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, మానవతా సహాయ చర్యలు, ప్రకృతి విపత్తులు లేదా ఇతర ప్రమాదాల అనంతరం సహాయక చర్యల సమయంలో ఈ విధానాలు అమలు చేయబడతాయి.
డూమా వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఒప్పందానికి ఆమోదం తెలపడం ద్వారా భారత్, రష్యా దేశాల మధ్య గగనతల వినియోగం, అలాగే యుద్ధ నౌకల పోర్టు కాల్స్ పరస్పరంగా సులభతరం అవుతాయని రష్యా మంత్రివర్గం పేర్కొంది.
ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య రక్షణ రంగ సహకారం మరింత బలపడుతుందని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/