📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: Russia Helicopter: కళ్ల ముందే కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్

Author Icon By Rajitha
Updated: November 9, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Russia Helicopter: Russiaలో జరిగిన హెలికాప్టర్ (Helicopter) ప్రమాదం భయంకరంగా మారింది. యుద్ధ విమానాల విడిభాగాలు తయారుచేసే కంపెనీ సిబ్బందిని తీసుకెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో అది ఓ ఇంటిపై దూసుకుపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో యుద్ధ విమానాల సాంకేతిక బృందానికి చెందిన కీలక సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Read also: America: హెచ్–1బీ వీసా హోల్డర్లపై ట్రంప్ కఠిన చర్యలు..175 మందిపై దర్యాప్తు!

సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని

Russia Helicopter: ప్రాథమిక సమాచారం ప్రకారం, సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. దక్షిణ రష్యాలోని డాగేస్తాన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో రష్యా కిజ్ల్యార్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్‌కు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారని మంత్రి యారోస్లావ్ గ్లాజోవ్ తెలిపారు. ఈ సంస్థ సుఖోయ్ మరియు మిగ్ యుద్ధ విమానాలకు అవసరమైన గ్రౌండ్ కంట్రోల్, డయాగ్నస్టిక్ సిస్టమ్స్ తయారు చేస్తుంది. హెలికాప్టర్ కూలిపోయిన క్షణాలను స్థానికులు వీడియోగా రికార్డ్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Dagestan Helicopter crash latest news russia Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.