📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Russia: దుబాయ్ పర్వతాల్లో రష్యన్ వ్యాపారవేత్త దంపతుల హత్య

Author Icon By Saritha
Updated: November 12, 2025 • 1:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అత్యాశకు వెళ్లి, అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని యత్నించేవారు ఎప్పుడూ ఆనందంగా జీవించలేరు. ప్రత్యేకంగా ప్రజలను మోసగించి, కోట్లను దండుకునేవారు చట్టం నుంచి తప్పించుకోగలరు కానీ, విధిరాత నుంచి తప్పించుకోలేరు. కొన్నిసార్లు దేవుడే వీరికి ఇలాంటి శిక్ష ఇస్తాడేమో అనిపిస్తుంది ఈ రష్యన్ దంపతుల హత్య ఉదంతాన్ని చదివితే.. (Russia)రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త రోమన్ నోవాక్, అతని భార్య అన్నా నోవాక్ దుబాయ్ లో హత్యకు గురయ్యారు. దుబాయ్ ఎడానిలో శరీరం ముక్కలు ముక్కలుగా నరికివేయబడినట్టుగా మృతదేహాలు కనిపించాయి. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

Read also: తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి

Russia: దుబాయ్ పర్వతాల్లో రష్యన్ వ్యాపారవేత్త దంపతుల హత్య

ఒమన్ సరిహద్దులోని పర్వతాల్లో చిక్కుకున్నారా?

పెట్టుబడిదారులతో సమావేశానికి వెళ్తున్నట్లుగా అక్టోబర్ 2న (Russia) రోమన్ నోవాక్ దంపతులు దుబాయ్(dubai) కు వెళ్లారు కారు డ్రైవర్ ఒమన్ సరిహద్దుకు దగ్గరగా హట్టా పాంతంలో ఒక సరస్సు దగ్గర దింపాడు. అక్కడ నుంచి రెండో వాహనంలో బయల్దేరి వెళ్లారు. అప్పటి నుంచి వీరి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే తాను ఒమన్ సరిహద్దులోని పర్వతాల్లో చిక్కుకున్నానని.. తనకు డబ్బులు అవసరం అంటూ పరిచయస్తులకు రోమన్ నోవాక్ సందేశం పంపించాడు. దీంతో బంధువులు వెతుక్కుంటూ వచ్చినా సమాచారం లభించలేదు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేయగా ఒకసారి హట్టాలోనూ.. మరోసారి ఒమన్ లో..మరొకసారి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అక్టోబర్ 4 నుంచైతే పూర్తిగా సిగ్నల్స్ కట్ అయిపోయాయి.

దుబాయ్ ఎడారిలో లభ్యమైన మృతదేహాలు

దంపతుల ఆచూకీ కోసం వెతుకుతుండగా తాజాగా దుబాయ్ ఎడారిలో మృతదేహాలు లభించాయి. భార్యాభర్తల శరీరాలు ముక్కలు ముక్కలుగా నరికేశారు. అయితే వ్యాపార లావాదేవీల్లో భాగంగానే దుండగులు కుట్రపన్ని ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే పెట్టుబడిదారుల ముసుగులో ఆకర్షించి ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

రోమన్ నోవాక్ కూడా ఓ దోషియే

రోమన్ నోవాక్ కూడా దోషిగా తేలిన మోసగాడే. ఫింటోపియా అనే ప్లాట్ ఫామ్ ను స్థాపించాడు. రష్యా, చైనా, పశ్చిమాసియా నుంచి పెట్టుబడులు ఆకర్షించాడు. అనంతరం 500 మిలియన్లతో పారిపోయాడు. భారీ మోసానికి పాల్పడినందుకు 2020లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. సెయింట్ పీటర్స్ బర్గ్ జైల్లో ఆరు సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించాడు. పెరోల్ మంజూర్ కాగానే 2023లో యూఏఈకి పారిపోయాడు చివరికి ఇలా ప్రాణాలు పొగొట్టుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anna Novak Crypto Fraud Dubai Desert Dubai Murder Latest News in Telugu Roman Novak Russian Business Couple Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.