📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Latest Telugu News: Russia: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ల తో భీకర దాడులు

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎవరెన్ని చెప్పినా..ఆను మాత్రం అనుకున్నది సాధించే వరకు పట్టు వదలను అన్నట్టు తయారయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin). వేల మంది ప్రాణాలు పోతున్నా..ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ఈరోజు కూడా పుతిన్‌తో మాట్లాడా..యుద్ధ ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి అని ప్రకటించారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తూ మాత్రం వేరేలా ఉంది. రష్యా..ఉక్రెయిన్ పై వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది.

Read Also: Johnson’s Company:జాన్సన్ కంపెనీ బేబీ పౌడర్‌ సంస్థపై కోట్లకు దావా

ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ల తో భీకర దాడులు

రాజధాని కైవ్‌లో విద్యుత్ అంతరాయాలు

తాజాగా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది రష్యా. 300 కి పైగా డ్రోన్లు, 37 క్షిపణులను మోహరించింది. దీని కారణంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా ఎనిమిది ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. రష్యా వదిలిన బాంబుల దాడికి ఆ దేశ విద్యుత్ గ్రిడ్ నాశనం అయిపోయింది. దీంతో ఉక్రెయిన్ లో ఎనిమిది ప్రాంతాలు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ఉక్రెయిన్ జాతీయ ఇంధన సంస్థ ఉక్రెనెర్గో తెలిపింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ DTEK, రాజధాని కైవ్‌లో కూడా విద్యుత్ అంతరాయాలు ఉన్నాయని చెప్పింది.

విద్యుత్ గ్రిడ్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు

ఇలా రష్యా మౌలిక సదుపాయాలను దెబ్బ తీయడం ఈ నెలలో ఇది ఆరవసారని తెలిపింది. రష్యా రాత్రిపూట ఉక్రెయిన్‌పై 300 కి పైగా డ్రోన్లు, 37 క్షిపణులను ప్రయోగించిందని అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. క్లస్టర్ మందుగుండు సామగ్రిని ఉపయోగించి, అత్యవసర సిబ్బంది, గ్రిడ్ మరమ్మతులలో పనిచేస్తున్న ఇంజనీర్లను చంపడానికి రష్యా పదేపదే దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. రష్యా ప్రధాన లక్ష్యాల్లో ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్ ఒకటి చెబుతున్నారు. అంతకు ముందు రష్యా ఆర్థిక వ్యవస్థ, యుద్ధ ప్రయత్నాలకు కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలు, సంబంధిత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. అందుకే ఇప్పుడు రష్యా విద్యుత్ గ్రిడ్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

ట్రంప్, జెలెన్ స్కీ భేటీ

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఓవల్ ఆఫీసులో భేటీ కానున్నారు. ఇందులో అమెరికా నుంచి క్రూయిజ్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థులు, ఉమ్మడి డ్రోన్ ఉత్పత్తి ఒప్పందాలను కోరనున్నారు. దాంతో పాటూ తోమహక్ క్షిపణుల గురించి కూడా ఇరు దేశాధినేతలూ చర్చించనున్నారు. అలాగే రష్యాపై కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను కూడా విధించాలని జెలెన్…ట్రంప్ ను కోరనున్నారు.

పుతిన్ ఎందుకు ప్రసిద్ధి చెందాడు?
జీవన ప్రమాణాలలో గణనీయమైన మెరుగుదలలు మరియు రష్యా తన పదవీకాలంలో ప్రపంచ దృశ్యంలో తనను తాను తిరిగి దృఢపరచుకోవడం ఫలితంగా పుతిన్ అధిక ఆమోద రేటింగ్‌లను పరిశీలకులు చూస్తున్నారు.

రష్యా ఎందుకు ప్రసిద్ధి చెందింది?
ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా రష్యా ప్రసిద్ధి చెందింది, ఇది దాని విస్తారమైన మరియు వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలకు దోహదపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Airstrikes drone attacks Eastern Europe Crisis Military Conflict russia Russia-Ukraine War Telugu News ukraine War News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.