📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia attack : ఉక్రెయిన్‌పై డ్రోన్‌లతో మళ్లీ రష్యా దాడి

Author Icon By Sudha
Updated: July 19, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్నాయి. అయినా ఉక్రెయిన్‌పై రష్యా (Russia) దాడులు కొనసాగిస్తోంది. తాజాగా రష్యా(Russia) సైన్యం ఉక్రెయిన్‌పై 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక ఉక్రెయిన్‌ (Ukraine)లో అనేక నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. భవనాల శిథిలాల కింద అనేక మంది అమాయక ప్రజలు చిక్కుకున్నారని, వారిని బయటకు తెచ్చేందుకు భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఉక్రెయిన్‌ మీడియా తెలిపింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. రష్యన్ (Russia) దళాలు ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై 20కి పైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. దాంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈశాన్య సుమీ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

Russia attack : ఉక్రెయిన్‌పై డ్రోన్‌లతో మళ్లీ రష్యా దాడి

ఆస్ట్రేలియా ఆయుధ సాయం

అయితే ఈ యుద్ధం సమయంలో తమకు అండగా ఉంటూ ఆయుధాలను సరఫరా చేస్తున్న మిత్ర దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు ఆస్ట్రేలియా ఆయుధ సాయం చేస్తోంది. ఇందులోభాగంగా శనివారం కీవ్‌కు M1A1 అబ్రమ్స్ ట్యాంకులను అందజేసింది. ఇతర సామగ్రిని రాబోయే నెలల్లో పంపనున్నట్లు ఆస్ట్రేలియా రక్షణమంత్రి రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు. కీవ్‌పై మాస్కో చేస్తున్న చట్టవిరుద్ధమైన, అనైతిక దండయాత్రకు వ్యతిరేకంగా తాము ఈ సాయాన్ని అందిస్తున్నామని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి తెలిపారు.

ఉక్రెయిన్ పై రష్యా ఎప్పుడు దాడి చేసింది?

2014 ఫిబ్రవరి 27న, ఎలాంటి చిహ్నం లేని రష్యన్ సైనికులు ఉక్రేనియన్ భూభాగం క్రిమియాపై దాడి చేయడం ప్రారంభించారు మరియు మార్చి చివరి నాటికి ద్వీపకల్పాన్ని పూర్తిగా నియంత్రించారు. మొదట, రష్యా సైనికులు తమవారు కాదని తిరస్కరించింది, కానీ పుతిన్ తరువాత వారు రష్యన్ ప్రత్యేక దళాలని అంగీకరించారు.

2014 లో ఉక్రెయిన్పై రష్యా ఎందుకు దాడి చేసింది?

ఉక్రెయిన్ తన ప్రభావ పరిధిని విడిచిపెట్టకుండా నిరోధించడానికి రష్యా చేసిన ప్రయత్నం చాలా సంవత్సరాల నాటిది, మరియు దాని ప్రారంభ దండయాత్ర 2014లో ప్రారంభమైంది, నెలల తరబడి జరిగిన సామూహిక ప్రదర్శనల తర్వాత రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను పదవీచ్యుతుడిని చేశారు

రష్యా ప్రధాన మిత్రదేశాలు?

యెమెన్‌లోని హౌతీల నుండి కూడా రష్యాకు బలమైన మద్దతు ఉంది. ది ఎకనామిస్ట్ ప్రకారం “రష్యా వైపు మొగ్గు చూపే” దేశాలతో రష్యా కూడా సానుకూల సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ దేశాలలో అల్జీరియా, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, ఇథియోపియా, సూడాన్ మరియు ఉగాండా ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Marco Rubio: ఉగ్రదాడి.. అమెరికా నిర్ణయంపై హర్షం

Breaking News Drone attack latest news russia Russia Ukraine War Russian military ukraine War News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.