రష్యా(Russia)కు యూరప్ కోర్టు(Europe Court) షాకిచ్చింది. 11 ఏళ్ల తర్వాత తీర్పు ఇస్తూ మలేషియా(Malaysia) విమానాన్ని రష్యానే కూల్చిందంటూ యూరప్ కోర్టు తేల్చింది. ఉక్రెయిన్(Ukraine)లో మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 ఏళ్ల క్రితం కుప్పకూలింది. 2014 జులై 17న ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తున్న మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం కూలిపోయింది. ఉక్రెయిన్ వేర్పాటువాదులు విమానంపై మిసైల్స్‌తో ఎటాక్ చేశారు.
రష్యానే కూల్చేసిందని..
దీంతో విమానంలో ఉన్న 283 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది మృతి చెందారు. రష్యా అధినేత పుతిన్ ఆదేశాలతోనే దాడి జరిగినట్లు యూరప్ కోర్టు తేల్చింది. రష్యా మిసైల్స్‌తోనే విమానాన్ని కూల్చారంటూ ఆధారాలు ఉండటంతో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే యూరప్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును రష్యా తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా రష్యా గతేడాది అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2-8243 విమానాన్ని కూడా కూల్చేసింది.
రష్యా ప్రతిస్పందన
యూరప్ కోర్టు తీర్పును రష్యా పూర్తిగా తిరస్కరించింది.
తమపై మోపిన ఆరోపణలు రాజకీయ ప్రేరణతో కూడినవని మాస్కో వర్గాలు పేర్కొన్నాయి.
గతేడాది కూడా ఇలానే..?
గత ఏడాది అజర్‌బైజాన్‌కు చెందిన జే2-8243 విమానాన్ని కూడా రష్యా కూల్చిందని ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానయాన భద్రతపై రష్యా చర్యలు ఆందోళనకు కారణమవుతున్నాయి .
రష్యా గురించి వాస్తవాలు ఏమిటి?
త్వరిత వాస్తవాలు
అధికారిక పేరు: రష్యన్ ఫెడరేషన్.
ప్రభుత్వ రూపం: సమాఖ్య.
రాజధాని: మాస్కో.
అధికారిక భాష: రష్యన్.
డబ్బు: రూబుల్.
రష్యా దేనికి ప్రసిద్ధి చెందింది?
లియో టాల్‌స్టాయ్ మరియు ఫ్యోడర్ దోస్తోవ్స్కీ వంటి రచయితలు, ప్యోటర్ ఇలిచ్ చైకోవ్స్కీ వంటి స్వరకర్తలు మరియు రుడాల్ఫ్ నురేయేవ్ వంటి బ్యాలెట్ నృత్యకారులు వంటి ఆలోచనాపరులు మరియు కళాకారులకు రష్యా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు