📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Spy Anna Chapman: ‘బ్యూటీ స్పై’కి కీలక బాధ్యతలు అప్పగించిన రష్యా

Author Icon By Vanipushpa
Updated: October 24, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతంలో తన అందం, మేధస్సుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి, అమెరికాలో అరెస్టై పబ్లిక్ సెలబ్రిటీగా మారిన మాజీ రష్యన్ గూఢచారి అన్నా చాప్‌మన్(Spy Anna Chapman) మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమెను తాజాగా రష్యాలోని నూతనంగా స్థాపించబడిన ‘మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్’ అధిపతిగా నియమించారు. గూఢచర్యం నుంచి గ్లామర్ ప్రపంచంలోకి, ఇప్పుడు రష్యా గూఢచార చరిత్ర సంరక్షకురాలిగా ఆమె ప్రయాణం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. 1982లో వోల్గోగ్రాడ్‌లో జన్మించిన అన్నా చాప్‌మన్, రష్యా విదేశీ గూఢచార సంస్థ తరపున పనిచేసింది. 2010లో, అమెరికాలోకి చొరబడి కీలక సమాచారాన్ని సేకరించే రష్యన్ ‘స్లీపర్ సెల్’ సభ్యురాలిగా న్యూయార్క్‌లో ఎఫ్‌బీఐ ఆమెను అరెస్టు చేసింది. అప్పటి ‘కోల్డ్ వార్’ అనంతర అతిపెద్ద గూఢచార మార్పిడి ఒప్పందంలో భాగంగా ఆమెతో పాటు మరో తొమ్మిది మంది ఏజెంట్లను అమెరికా రష్యాకు అప్పగించింది.

Read Also: Trump: కెనడాతో అమెరికా వాణిజ్య చర్చలు రద్దు: ట్రంప్

Spy Anna Chapman

తక్కువ టైంలోనే ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన చాప్‌మన్

రష్యాకు తిరిగి వచ్చిన తర్వాత, చాప్‌మన్ తనకున్న అపారమైన ప్రచారాన్ని ఉపయోగించుకుని తక్కువ టైంలోనే ప్రముఖ వ్యక్తిగా మారింది. ఆమె టీవీ షోల వ్యాఖ్యాతగా, మోడల్‌గా, వ్యాపారవేత్తగా ఎదిగింది. దేశభక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, రష్యా రాజకీయ ప్రముఖులకు దగ్గరైంది. పశ్చిమ దేశాల మీడియా ఆమెను ‘బ్లాక్ విడో’ అని, రష్యా మీడియా ‘ఏజెంట్ 90-60-90’ అని అభివర్ణించింది. క్రెమ్లిన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన ఈ 43 ఏళ్ల మాజీ గూఢచారికి ‘మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్’కు నాయకత్వం వహించే బాధ్యత అప్పగించడం ఒక ‘సింబాలిక్’ చర్యగా అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మ్యూజియం రష్యా గూఢచార చరిత్ర, వారి విజయాలను ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడింది.

అన్నా చాప్‌మన్ కథ ఏమిటి?
అన్నా వాసిలీవ్నా చాప్‌మన్ జననం అన్నా వాసిలీవ్నా కుష్చెంకో, 23 ఫిబ్రవరి 1982) ఒక రష్యన్ మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్, మీడియా వ్యక్తి మరియు మోడల్, ఇతను 27 జూన్ 2010లో రష్యన్ ప్రోగ్రాం భాగంగా యునైటెడ్ స్టేట్స్‌లో అరెస్టు చేయబడ్డాడు.

అన్నా చాప్‌మన్‌ను ఎలా పట్టుకున్నారు?
చాప్‌మన్‌పై కేసు పాతకాలపు గమ్‌షూ పనికి సంబంధించినది, ఆధునిక మలుపుతో. "మేము ఆమెకు మరియు ఆమె హ్యాండ్లర్‌కు మధ్య జరిగిన సంభాషణలను వైర్‌లెస్‌గా సంగ్రహించగలిగాము"

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Beauty Spy Espionage news Global Politics International Relations russia Russian intelligence Spy operations Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.