📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

PM Modi: మోదీని కలవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి!

Author Icon By Shobha Rani
Updated: June 11, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో కొవిడ్‌(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. గత 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 7,121కు చేరాయి. దేశంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని కలిసే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ (RT-PCR) పరీక్ష చేయించుకోవాలని పీఎంఓ సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
కొత్త వేరియంట్ల భయం అవసరం లేదు: ఆరోగ్యశాఖ
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక తాజా డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,121లకు చేరింది. దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్‌ కేసులు ఉండగా.. గుజరాత్‌, దిల్లీ, పశ్చిమబెంగాల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా (Corona) కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని.. ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

PM Modi: మోదీని కలవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి!

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలో మొత్తం 7,121 (Corona) కేసులు ఉండగా.. కేరళలో అత్యధికంగా 2,223 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌ 1,223, దిల్లీ 757, పశ్చిమబెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, ఉత్తరప్రదేశ్‌ 229, తమిళనాడు 204, రాజస్థాన్‌ 138, హరియాణా 125, ఆంధ్రప్రదేశ్‌ 72, మధ్యప్రదేశ్‌ 65, మహారాష్ట్ర 615, ఛత్తీస్‌గఢ్‌, 48, బిహార్‌ 47, ఒడిశా 41, సిక్కిం, పంజాబ్‌ ఒక్కో రాష్ట్రంలో 33 చొప్పున కేసులు, తెలంగాణ 11, పుదుచ్చేరి, ఝార్ఖండ్‌లలో చెరో 10 కేసులు, జమ్మూకశ్మీర్‌ 9, అస్సాం, గోవాల్లో 6, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌ 3, హిమాచల్‌ ప్రదేశ్‌ 2, మణిపుర్‌, త్రిపుర చెరో కేసు నమోదయ్యాయి.
కొవిడ్‌పై కేంద్రం అప్రమత్తం
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారికంగా కొవిడ్ మానిటరింగ్ సిస్టమ్‌ను తిరిగి యాక్టివేట్ చేసింది. ప్రతి రాష్ట్రానికి అలెర్ట్ నోటీసులు, టెస్టింగ్ పెంపు సూచన. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సప్లై యథాతథంగా ఉంచాలని ఆదేశాలు చేసింది. జన సమూహాలలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. అలసట, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని సూచనఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడమే అత్యవసరం. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, వ్యక్తిగత జాగ్రత్తలే ముందువరుస రక్షణ అని గుర్తుంచుకోవాలి.

Read Also: Al Qaeda: ట్రంప్ ను చంపేస్తామని అల్ ఖైదా హెచ్చరిక..

Breaking News in Telugu Google news Latest News in Telugu Paper Telugu News RTPCR test is mandatory Telugu News Telugu News online Telugu News Today to meet Modi! Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.