📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation sindoor: ‘భవిష్యత్తు యుద్ధంలో డ్రోన్లు, స్పేస్, సైబర్‌స్పేస్ పాత్ర కీలకం’

Author Icon By Shobha Rani
Updated: May 16, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్​(Operation sindoor) తో​ ఆధునిక యుద్ధంలో డ్రోన్​ల ప్రాముఖ్యం తెలిసివచ్చిందని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్​ అనిల్ భట్​ (Anil Kumar Bhatt) అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు యుద్ధంలో అంతరిక్షం, సైబర్​స్పేస్​ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ప్రతీ దేశం తమ ఆస్తులను అంతరిక్షంలో సురక్షితంగా దాచుకుంటుందని అంచనా వేశారు. యుద్ధంపై సోషల్​ మీడియాలో వచ్చిన వార్తలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం అనేది చాలా తీవ్రమైన అంశమని, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే యుద్ధం చివరి ఎంపికగా ఉండాలని సూచించారు. ఈయన డోక్లామ్​ ఉద్రిక్తతల సమయంలో డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ మిలిటరీ ఆపరేషన్స్​గా పని చేశారు. ఇండియన్ స్పేస్​ అసోసియేషన్ డైరెక్టర్​గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) నేపథ్యంలో ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకమని అనిల్ భట్ (Anil Kumar Bhatt) స్పష్టం చేశారు. డ్రోన్ల సహకారంతో యుద్ధ ప్రయోగాల్లో విజయం సాధించడం సాధ్యపడిందని తెలిపారు.

Operation sindoor: ‘భవిష్యత్తు యుద్ధంలో డ్రోన్లు, స్పేస్, సైబర్‌స్పేస్ పాత్ర కీలకం’

మిలిటరీ ఆపరేషన్స్‌లో డీజీఎంఓ పాత్ర
“డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ మిలిటరీ ఆపరేషన్స్ సైనిక కార్యక్రమాల విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. అది యుద్ధంలోనైనా, శాంతి చర్చల్లోనైనా ప్రణాళిక అమలు, పర్యవేక్షణ చేస్తుంటారు. కేవలం ఆర్మీతోనే కాకుండా మూడు విభాగాల మద్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమయంలో యుద్ధం ఒకే విధానంలో జరగడం లేదు. కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్​తో కలిపి సమన్వయం చేసుకోవడం చాలా అవసరం అని అనిల్ భట్(Anil Kumar Bhatt) , మాజీ డీజీఏంఓ అన్నారు.సైనిక ప్రణాళికలు రూపొందించడం, అమలు చేయడం, పర్యవేక్షించడం.యుద్ధం మరియు శాంతి చర్చల్లో సమన్వయం కల్పించడం. ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్‌లతో సమన్వయం అవసరం అని తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలు భూమిపైన మాత్రమే కాకుండా, అంతరిక్షం (స్పేస్), మరియు సైబర్‌స్పేస్‌లోనూ జరిగే అవకాశముందని చెప్పారు. దేశాలు తమ విలువైన ఆస్తులను అంతరిక్షంలో భద్రంగా నిల్వ చేసుకునే దిశగా ప్రయత్నిస్తాయని అభిప్రాయపడ్డారు.

భారత్‌కు డ్రోన్ ఉత్పత్తి సామర్థ్యం అవసరం

ఆపరేషన్ సిందూర్​(Operation sindoor) లో పాకిస్థాన్​కు తుర్కియే మద్దతు ఇవ్వడంపైనా ఆయన మాట్లాడారు. తుర్కియే యుద్ధ సామాగ్రిని తయారు చేస్తుందని, చాలా దేశాలకు విక్రయిస్తుంటుందని చెప్పారు. ఇందులో భౌగోళిక రాజకీయ కారణాల కన్నా వ్యాపార ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు. “భారత్​కు యుద్ధంలో ఎక్కువ కాలం పాటు ఉంటే చాలా డ్రోన్లు అవసరం పడుతాయి. ఇందులో చాలా వరకు ఒకసారి ఉపయోగించేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు అవసరం. ఈ మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో భారత్ సామార్థ్యాన్ని పెంచుకోవాలి.” అని అనిల్ భట్​ (Anil Kumar Bhatt) తెలిపారు. భారత్ తాను స్వయంగా డ్రోన్లు తయారు చేసే సామర్థ్యం పెంచుకోవాలి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా “మాస్ ప్రొడక్షన్” చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో సైనిక ఘర్షణలు మరింత సాంకేతికత ఆధారంగా జరగబోతున్నాయి. డ్రోన్లు, స్పేస్, మరియు సైబర్‌స్పేస్ ఆధారిత యుద్ధాల కోసం భారత్ ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ భట్ సూచించారు.

Read Also: Turkey Earthquake : టర్కీలో 5.1 తీవ్రతతో భూకంపం

'Role of drones #telugu News Breaking News in Telugu cyberspace is crucial in future war' Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News space Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.