రాజకీయాల నుంచి టెక్నాలజీకి రిషి సునాక్ మార్పు
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్( Rishi Sunak Microsoft) ఇప్పుడు రాజకీయాల నుంచి టెక్ రంగానికి మకాం మార్చారు. 2022లో భారత సంతతికి చెందిన వ్యక్తిగా యుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించిన సునాక్, 2024లో కన్జర్వేటివ్ పార్టీ పరాజయం తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్‌లో కొనసాగుతున్నారు.
Read also: Bihar Elections: బీహార్ ఎలక్షన్స్ లో తేజస్వి యాదవ్ కు అనుకూలం
మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుడిగా
ఇప్పుడు రిషి సునాక్(Rishi Sunak Microsoft) టెక్నాలజీ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో సీనియర్ అడ్వైజర్‌గా చేరారు. ఈ రెండు సంస్థలకు రిషి సునాక్ సాంకేతిక, ఆర్థిక మరియు భౌగోళిక అంశాలపై వ్యూహాత్మక మార్గదర్శకాలు అందించనున్నారు. ఈ నియామకానికి యూకే వ్యాపార నియామక కమిటీ (ACOBA) ఆమోదం తెలిపింది. అయితే, ఆయనపై రెండు సంవత్సరాలపాటు ప్రభుత్వ మంత్రులను లాబీయింగ్ చేయకూడదని, కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు తెచ్చిపెట్టకూడదని షరతు విధించింది.
టెక్ రంగంలో సునాక్ అనుభవం, దృష్టి
యూకే ప్రధానిగా ఉన్న సమయంలో రిషి సునాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధికి పెద్దపీట వేశారు. గతంలో గోల్డ్‌మన్ సాచ్స్లో(Goldman sachs) పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. టెక్నాలజీ రంగంపై ఉన్న ఆసక్తి, వ్యూహాత్మక ఆలోచనల వల్ల ఆయన మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్ వంటి సంస్థల సలహాదారుడిగా ఎంపికయ్యారు. 2021లో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థ, ఓపెన్‌ఏఐకి ప్రధాన పోటీదారుగా పేరుగాంచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: